Homeటాప్ స్టోరీస్ఆచార్య షూటింగ్ ప్లాన్ పై ఒక నిర్ణయానికొచ్చిన చిరు, కొరటాల

ఆచార్య షూటింగ్ ప్లాన్ పై ఒక నిర్ణయానికొచ్చిన చిరు, కొరటాల

ఆచార్య షూటింగ్ ప్లాన్ పై ఒక నిర్ణయానికొచ్చిన చిరు, కొరటాల
ఆచార్య షూటింగ్ ప్లాన్ పై ఒక నిర్ణయానికొచ్చిన చిరు, కొరటాల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. అలాగే ఈ సినిమాకు కాపీ ఆరోపణలు కూడా రాగా వాటిని కొరటాల శివ బలంగా తిప్పి కొట్టారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంకా ఉన్నా కానీ షూటింగ్ విషయంలో సినీ ప్రముఖులు ఒక క్లారిటీకి వస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ ను మొదలుపెడుతున్నారు. ఒక్కొక్కరుగా షూటింగ్స్ ను ప్లాన్ చేస్తున్నా కానీ ఇంకా ఆచార్య షూటింగ్ మొదలుకావట్లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ విషయంలో అటు చిరంజీవి, ఇటు కొరటాల శివ ఇటీవలే మీట్ అయ్యి ఒక క్లారిటీ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్య షూటింగ్ ను ఇప్పుడప్పుడే మొదలుపెట్టకూడదని అనుకుంటున్నారు. మరో రెండు నెలలు ఆగి అప్పటి పరిస్థితుల ప్రభావం మేరకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

ఒకసారి షూటింగ్ మొదలుపెడితే సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సో, ఆచార్య షూటింగ్ నవంబర్ కు కానీ మొదలయ్యే అవకాశం లేదన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All