Homeటాప్ స్టోరీస్వెరైటీ సినిమాలతో దూసుకెళ్తున్న యువ నటుడు

వెరైటీ సినిమాలతో దూసుకెళ్తున్న యువ నటుడు

వెరైటీ సినిమాలతో దూసుకెళ్తున్న యువ నటుడు
వెరైటీ సినిమాలతో దూసుకెళ్తున్న యువ నటుడు

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత సులువైన విషయం కాదు. మొదట్లో వరసగా రెండు, మూడు హిట్లు వచ్చినా సరైన గైడెన్స్ లేకపోతే యువ హీరోలు ఎలా బోల్తా పడతారు అన్నదానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. మన తెలుగులో తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు మొదట్లో హిట్లు కొట్టినా తర్వాత సరైన సినిమాలు చేయక చతికిలపడ్డారు. తరుణ్ ఇండస్ట్రీకి చెందినవాడే, చిన్నప్పటినుండి సినిమాలు చేసిన అనుభవం ఉంది. కానీ ఉదయ్ కిరణ్ ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ కూడా అంతే. మొదట్లో హిట్లు కొట్టినా వాటిని సస్టైన్ చేయడం తెలీలేదు. అందుకనే ఇప్పుడు ప్లాపులలో ఉన్నాడు. ఇది టాలీవుడ్ వరకూ పరిస్థితి. బాలీవుడ్ లో అయినా ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ ఒక యువ నటుడు వరసగా ప్రయోగాత్మక చిత్రాలతో, వెరైటీ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడమే కాదు హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు. ఆల్రెడీ డబల్ హ్యాట్రిక్ కొట్టాడు. ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నాడు. నేషనల్ అవార్డు కూడా సాధించాడు. రీసెంట్ గా మరో వెరైటీ సినిమా చేసిన ఈ నటుడు అక్కడ ఆశ్చర్యపరిచే వసూళ్లతో అందరినీ నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాడు. ఇప్పటికే అర్ధమైందిగా చెప్పేది ఆయుష్మాన్ ఖురానా గురించని. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాకింగ్ లేకుండా స్వశక్తితో పైకి ఎదిగిన ఆయుష్మాన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. వెరైటీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.

శుభమంగల్ సావదాన్, అంధధూన్, బదాయి హో, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, ఇక ఇప్పుడు బాలా.. ఇలా వరసగా ఆయుష్మాన్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అన్నీ వెరైటీ సినిమాలే. వరస హిట్లతో బాలీవుడ్ లో డబల్ హ్యాట్రిక్ కొట్టాడు ఆయుష్మాన్అంధధూన్ తో అయితే నేషనల్ అవార్డు సైతం సాధించాడు. ప్రస్తుతం నటించిన బాలా చిత్రమైతే రెండు రోజుల్లోనే 23 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. బట్టతల నేపథ్యంలో సాగిన ఫన్నీ ఎంటర్టైనర్ బాలా. ఇటీవలే ఇదే కాన్సెప్ట్ తో ఉజ్దా చమాన్ అనే చిత్రం విడుదలైనా దానికి పెద్దగా వసూళ్లు ఏం రాలేదు. అందరూ ఆయుష్మాన్ సినిమా కోసమే ఎదురుచూసారు. అంతలా ఉంది బాలీవుడ్ లో అతని క్రేజ్. గత మూడు చిత్రాలతో 100 కోట్ల కలెక్షన్ సాధించిన ఆయుష్మాన్ ఇప్పుడు బాలాతో మరోసారి ఆ మార్క్ ను చేరుకోబోతున్నాడు. ఇంత కన్సిస్టెంట్ గా 100 కోట్లు సాధిస్తున్న హీరో, బాలీవుడ్ లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. వరసగా హిట్లు కొట్టడమే కాదు, ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా కూడా ఉన్నాడు. అటు క్వాలిటీ, ఇటు క్వాంటిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళుతున్నాడు ఆయుష్మాన్.

- Advertisement -

తన టాలెంట్ ను, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను నమ్ముకుని ముందుకు వెళుతున్న ఆయుష్మాన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All