
భరత్ అంటే అంత తొందరగా ఎవరికీ గుర్తుకు రాక పోవచ్చు, కానీ మన చిన్నప్పుడు “యువసేన” ఒక సినిమా వచ్చింది అందులో ఒక నలుగురు కుర్రాళ్లు ఉంటారు. తప్పు చేసిన, అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారులను చంపుతూ ఉంటారు.
అందులో మన హీరో శర్వానంద్ తో పాటు ఒక కుర్రాడు నటించాడు అతను భరత్. కరెక్టుగా చెప్పాలంటే మన వాళ్ళకి “ప్రేమిస్తే” సినిమా భరత్ అంటే తొందరగా గుర్తుంటుంది. ఎందుకంటే తమిళంలో ఎంత హిట్ అయ్యిందో తెలీదు కానీ, తెలుగులో మాత్రం భరత్ కి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా అది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినా, భరత్ కి బ్రేక్ రాలేదు.
తమిళంలో హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు భరత్. గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “స్పైడర్” సినిమా లో మెయిన్ విలన్ S.J సూర్య తమ్ముడు క్యారెక్టర్ లో భరత్ కనిపించాడు. కనిపించింది కాసేపైనా తన హావభావాలతో నటనతో మనల్ని మెప్పించాడు.
మంచి ఫిజిక్ కూడా మెయింటేన్ చేసే భరత్ కు ఇప్పుడు బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. గతంలో పెద్ద కొరియోగ్రాఫర్ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్ అయిన ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఇప్పుడు “రాధే” అనే ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమాలో సల్మాన్. “యూవర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు మన హీరో భరత్. దిశా పటానీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది ఎప్పటిలాగే వచ్చే సంవత్సరం రంజాన్ పండగ కి మన సల్లూభాయ్ “రాధే” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తనకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు ప్రభుదేవాకు మరియు సల్మాన్ ఖాన్ కు తానూ ఎంతగానో, రుణపడి ఉంటానని భరత్ సంతోషం వ్యక్తం చేసాడు.
మరి ఈ సినిమా హిట్ అయి మన “ప్రేమిస్తే భరత్” బాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలని ఆశిద్దాం.