Homeటాప్ స్టోరీస్ఆది `బ్లాక్` డ‌బుల్ ట్రీట్ అదిరిందిగా!

ఆది `బ్లాక్` డ‌బుల్ ట్రీట్ అదిరిందిగా!

ఆది `బ్లాక్` డ‌బుల్ ట్రీట్ అదిరిందిగా!
ఆది `బ్లాక్` డ‌బుల్ ట్రీట్ అదిరిందిగా!

యంగ్ హీరో ఆది సాయికుమార్ గ‌త కొంత కాలంగా రేసులో వెన‌క‌బ‌డి వున్న విష‌యం తెలిసిందే. తాజాగా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ స్పీడు పెంచారు. అయితే ప్ర‌తీ మూవీ కొత్త‌గా వుండేలా ప్లాన్ చేసుకుంటున్న ఆది `జంగిల్‌` టీజ‌ర్‌తో ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న‌ప `జంగిల్‌` ఆదికి హిట్ ఇచ్చేలా క‌నిపిస్తోంది. ఈ మూవీతో పాటు ఆది న‌టిస్తున్న మ‌రో చిత్రం `బ్లాక్‌`.

మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్‌పై మ‌హంకాళి దివాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.బి. కృష్ణ దర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆది తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. హీరో ఆది సాయికుమార్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించికుని చిత్ర బృందం ఈ చిత్ర న్యూ లుక్ పోస్ట‌ర్‌ని బుధ‌వారం విడుద‌ల చేసింది.

- Advertisement -

కొత్త పోస్టర్‌లో ఆది డబుల్ రోల్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. టు డిఫ‌రెంట్ గెట‌ప్స్‌ల‌లో ఆది క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. చాలా కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ ఈ మూవీతో ఆడియ‌న్స్‌కి డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All