Homeటాప్ స్టోరీస్ఆది సాయికుమార్ `జంగిల్‌`తో కొట్టేలా వున్నాడే!

ఆది సాయికుమార్ `జంగిల్‌`తో కొట్టేలా వున్నాడే!

ఆది సాయికుమార్ `జంగిల్‌`తో కొట్టేలా వున్నాడే!
ఆది సాయికుమార్ `జంగిల్‌`తో కొట్టేలా వున్నాడే!

యంగ్ హీరో ఆది సాయికుమార్ గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంత ప్ర‌య‌త్నించినా స‌క్సెస్ ద‌రి చేర‌డం లేదు. అయితే ఈ సారి స‌క్సెస్ కొట్టేలా క‌నిపిస్తున్నాడు. ఆది సాయికుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం `జంగిల్‌`. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ – విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ణ‌వీర్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై గోవింద‌రాజ్, అర్చ‌నా చందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేదిక హీరోయిన్‌.

ఫ‌స్ట్ లుక్‌తో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన `జంగిల్` టీమ్ తాజాగా టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. `కార‌కుడు ఎరైనాడు… క‌న్న‌త‌ల్లి కాళాంత‌కురాలైంది… సురుడు శ‌వ‌మైనాడు.. శ‌వాన్ని పీక్కుతున్న‌వాడు.. గాలిలో క‌లిసి దిక్కుల‌లో వ్యాపించి.. చ‌ర్మం చీల్చి.. రుధిరం భుజింజి… ఉసురు తీస్తాడు.. వీడు ర‌క్క‌సుడు.. ` అంటూ టీజ‌ర్‌లో వినిపిస్తున్న వాయిస్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీనికి జోస్ ఫ్రాంక్లీన్ అందించిన నేప‌థ్య సంగీతం భ‌యంక‌రంగా సినిమా మూడ్‌ని తెలియ‌జేస్తోంది.

- Advertisement -

జోస్ ఫ్రాంక్లీన్ సంగీతానికి గౌత‌మ్ జార్జ్ విజువ‌ల్స్ ఓ రేంజ్‌లో భ‌యాన్ని క‌లిగిస్తున్నాయి. టీజర్‌లోని విజువ‌ల్స్‌కి త‌గ్గ‌ట్టే న‌టీన‌టుల హావ భావాలున్నాయి. వెన్నులో వ‌ణుకుపుట్టించే స్థాయిలో వున్న ఈ టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఆది సాయికుమార్ ఖ‌చ్చి‌తంగా ఈ మూవీతో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకునేలా క‌నిపిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All