Homeటాప్ స్టోరీస్ఆది సాయికుమార్ `బుర్ర‌క‌థ‌` వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న వింటేజ్ క్రియేష‌న్స్‌

ఆది సాయికుమార్ `బుర్ర‌క‌థ‌` వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న వింటేజ్ క్రియేష‌న్స్‌

Aadi Saikumar ‘Burra Katha’ Worldwide Theatrical Rights Bought By Vintage Creations

ఆది సాయికుమార్ హీరోగా.. రైట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు తొలిసారి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `బుర్ర‌క‌థ‌`. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్ కార‌ణంగానే సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది. నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూన్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ హ‌క్కులు, శాటిలైట్ హ‌క్కులు కూడా అమ్ముడైపోయాయి.

- Advertisement -

ప్ర‌స్తుతం సినిమా గోవాలో షూటింగ్ జ‌రుగుతుంది. అలాగే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి కీల‌క పాత్ర‌ధారులు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫన్ రైడ‌ర్‌గా అల‌రించ‌నుంది.

న‌టీన‌టులు:

ఆది సాయికుమార్‌
మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి
నైరా షా, రాజేంద్ర ప్ర‌సాద్‌
పోసాని కృష్ణ‌ముర‌ళి
పృథ్వీరాజ్‌
గాయ‌త్రి గుప్తా
అభిమ‌న్యు సింగ్‌
ఫిష్ వెంక‌ట్‌
ప్ర‌భాస్ శ్రీను
గీతా సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌లు: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
బ్యాన‌ర్‌: దీపాల ఆర్ట్స్
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: సి.రాంప్ర‌సాద్‌
ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్యా భ‌వ‌న్ దిడ్ల‌
ఆర్ట్‌: చిన్నా
పాట‌లు: శివ‌శ‌క్తి ద్త‌, భాస్క‌ర భ‌ట్ల‌, కె.కె
ఫైట్స్‌: వెంక‌ట్, సాల్మ‌న్ రాజ్‌, రియ‌ల్ స‌తీష్‌
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All