Homeటాప్ స్టోరీస్న్యూజెర్సీ ప్ర‌భుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌

న్యూజెర్సీ ప్ర‌భుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌

Dr. Rajendra Prasad felicitated for receiving US state honour41 సినీ ప్ర‌స్థానంలో న‌వ ర‌సాలున్న ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. 237 సినిమాల్లో న‌టించిన ఈయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు. ఈసెంట్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. అదేంటంటే న్యూజెర్సీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో స్ట్రెస్ రిలీఫ్ ఆర్టిస్ట్‌గా రాజేంద్ర ప్ర‌సాద్‌నున గుర్తించ‌డంతో ఆయ‌నకు అక్క‌డి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ, సెనేట్ లైఫ్ అచీవ్‌మంట్ అవార్డును అందించింది. ఇటీవ‌ల ఈ అవార్డును రాజేంద్ర‌ప్ర‌సాద్ స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు, నాగ్ అశ్విన్‌, స‌తీశ్ వేగేశ్న‌, కాదంబ‌రి కిర‌ణ్, అనిల్ రావిపూడి, నందినీ రెడ్డి, బంద‌రు బాబీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “న‌టుడిగా 41 ఏళ్లు వివిధ పాత్ర‌ల్లో రాణిస్తున్నానంటే కార‌ణం నా ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌న్ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులే. కొత్త త‌రం ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు కాబ‌ట్టి.. ఈ వ‌య‌సులో కూడా నేను కొత్త పాత్ర‌ల‌తో మెప్పించ‌గ‌లుగుతున్నాను. ఈ జ‌ర్నీలో ఎన్నో అవార్డులు అందుకున్నా.. యు.ఎస్‌లోని న్యూ జెర్సీ గ‌వ‌ర్న‌మెంట్ నుండి అవార్డు అందుకోవడం ప్ర‌త్యేకం అని ఎందుకు అంటున్నానంటే.. న్యూజెర్సీలో తెలుగు ప్రేక్ష‌కులే కార‌ణం. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు ఓట్లు కోసం వెళ్లిప్పుడు వారు నా గురించి నా సినిమాల గురించి గొప్ప‌గా చెప్ప‌డం వ‌ల్ల‌నే న్యూజెర్సీ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ, సెనేట్ నాకు స్ట్రెస్ రిలీవ‌ర్‌గా గుర్తించి నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును బ‌హూకరించారు. ఈ అవార్డును తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అంకితం చేస్తున్నాను. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో.. అన్ని చోట్ల ఉన్న‌ట్లే మంచి, చెడు రెండూ ఉన్నాయి. అంద‌రూ చెడు వైపు కాకుండా మంచి వైపు చూడండి. చెడు కంటే మంచే ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంది. అందువ‌ల్ల‌నే మేం ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్ చేయ‌గ‌లుగుతున్నాం“ అన్నారు.

రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ – “రాజేంద్ర‌ప్ర‌సాద్ యాక్ట‌ర్‌గా కంటే వ్య‌క్తిగా, మిత్రుడిగా నాతో మంచి అనుబంధం ఉంది. మ‌మ్మ‌ల్ని భార్యాభ‌ర్త‌లంటూ ఉంటారు. ఆయ‌న న‌టించిన 237 సినిమాల్లో నాతోనే 35 సినిమాలు చేశాడు. ఇలాంటి అవార్డు రావ‌డం అరుదైన సంద‌ర్భం. దీన్ని మ‌నం అంద‌రం సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది“ అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌వ‌ర‌స నాయ‌కుడు. ఎందుకంటే ఆయ‌న న‌వ‌ర‌సాల‌ను అద్బుతంగా పండించ‌గ‌ల న‌టుడు. అంతే కాకుండా ఆయ‌న చేస్తే ఏ పాత్ర అయినా కొత్త‌గాఉంటుంది“ అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ “రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు నాకంటే వ‌య‌సులో పెద్ద‌వారైనా నా బాల్య‌మిత్రులు. ఎందుకంటే చిన్న‌ప్పుడు ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఆయ‌న సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయ‌న పాత్ర‌లు గురించి మ‌నం ఎప్ప‌టికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం“ అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – “త‌న న ట‌న‌తో పాటు సినిమాకు కూడా రాజేంద్ర ప్ర‌సాద్‌గారు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ మా మ‌హాన‌టి చిత్ర‌మే. అందులో ఆయ‌న చౌద‌రిగారి పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్‌గా మా వెనుకుండి మ‌మ్మ‌ల్ని ముందుకు సాగేలా ప్రోత్స‌హించారు“ అన్నారు.

స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ “రాంజేంద్ర‌ప్ర‌సాద్‌గారి లేడీస్ టైల‌ర్ సినిమా చూసే నేను ర‌చ‌యిత‌గా మారాను. నాతో పాటు ఎంతో మందిని ఆయ‌న న‌ట‌న‌తో ఇన్‌స్పైర్ చేశారు“ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో బంద‌రు బాబీ, ర‌మేశ్ చెప్పాల త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All