Homeటాప్ స్టోరీస్ఆంధ్రప్రదేశ్ కొత్త సి.ఎస్ గా రాబోతున్న నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ కొత్త సి.ఎస్ గా రాబోతున్న నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ కొత్త సి.ఎస్ గా రాబోతున్న నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ కొత్త సి.ఎస్ గా రాబోతున్న నీలం సాహ్ని

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గారు నియమితులు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్.వి సుబ్రహ్మణ్యం గారు గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేయబడ్డారు. ఆయన స్థానంలో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా పనిచేస్తున్న శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు, కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని గారిని ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకం లాంఛనమే అని తెలుస్తోంది. 1984 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన నీలం సాహ్ని గారు గతంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కార్యదర్శిగా సేవలందించారు. ఆమె భర్త అజయ్ సాహ్ని గారు ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నీలం సాహ్నిగారు వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All