Homeటాప్ స్టోరీస్తెలుగు సినిమాకు రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తెలుగు సినిమాకు రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Andhra Pradesh government announces subsidies for Telugu cinema*బడ్జెట్ 4 కోట్లు లోపు నిర్మించే చిత్రాలకు ఏ పి టాక్స్ లేదు.
*ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా నిర్మించు లొకేషన్స్ ఉచితంగా పర్మిషన్.
*FDC ద్వారా షూటింగ్ లకు సింగల్ విండో ద్వారా అనుమతి.
*FDC పర్యవేక్షణలో ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు సబ్సిడీ ఏడాదికి 15 చిత్రాలకు మాత్రమే.. *వైజాగ్ రామానాయుడు స్టూడియో సమీపంలో 316 ఎకరాలలో స్టూడియో లు నిర్మించడానికి అనుమతి.
*నవంబర్‌, డిసెంబర్‌లో సినీ, టీవీ నంది అవార్డ్సు ఫంక్షన్‌.
* పుణా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ తరహా అమరావతిలో 20 ఎకరాలలో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌.

ఏపీ ప్రభుత్వం చిన్న సినిమాలకు పలు ప్రోత్సాహకాలను కలిపిస్తోంది. పన్ను రాయితీలు ఇవ్వనుంది. జీఎస్‌టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్‌ 116 జారీ చేసినట్లు ఏపీ ఫిలిండవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అంబికాకృష్ణ పత్రికా ముఖంగా వెల్లడించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న సినిమాలకు అండగా ఉండాలని ఆంద్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు

- Advertisement -

ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ 4 కోట్లలోపు పెట్టుబడితో తీసే సినిమాలకు ఈ రాయితీలు వర్తింపచేయాలని నిర్ణయించాము. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్ధికంగా ఎన్ని ఒడిదుడుకులున్నా చిత్ర పరిశ్రమకు అండగా నిలవాలని ముఖ్య మంత్రిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వ ఉతర్వుల ప్రకారం ఆంధ్ర రాష్ట్రము లో నిర్మించే చిత్రాలకు ఈ రాయితీలు వస్తిస్తాయి. ఇక్కడ ఇంకా సాంకేతికపరంగా వసతులు లేవు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో కొన్ని మినహాహింపులు ఉంటాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్‌ లో తీసే సినిమాల షూటింగ్‌లు ఉచితంగా చేసుకోవడానికి అనుమతులు ఇస్తాము . అయితే ముందుగా కాషన్‌ డిపాజిట్‌ సినీ నిర్మాత చెల్లిస్తే షూటింగ్‌ తర్వాత తిరిగి వారికి చెల్లిస్తాము. ఏపీలో తీసే సినిమాలకు ఎఫ్‌డీసీ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తాము .

ఈ సినిమాలపై టాక్స్‌ రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుంది రూ 4 కోట్లలోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18 శాతంలో.. రాష్ట్ర జీఎస్టీ 9 శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్‌ప్రొడక్షన్‌, షూటింగ్‌, డబ్బింగ్‌ చేయాలనే నిబంధన పెట్టామన్నారు. సినిమాలో నటించే వారికి ఇచ్చే రెమ్యూనరేషన్‌ తప్ప ప్రొడక్షన్ ప్రీ బడ్జెట్ వివరాలు ముందుగానే ఏ పి యఫ్ డి సి కి ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. చలనచిత్రం మొత్తం ఏపీలోనే నిర్మించారా?లేదా అనే అంశాన్ని ఏ పి యఫ్ డి సి నిర్థారించిన తర్వాతే రాయితీని విడుదల చేస్తాము.” ఇంకా నిబంధనలను సడలించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన కథాంశాలతో తీసే చిన్న సినిమాలకు రూ 10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. అయితే ఏడాదికి 15 చిన్న సినిమాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. వాటిని ఎంపిక చేయడానికి సినీ పరిశ్రమలో వున్నా ప్రముఖుల తో కమిటీ వేస్తామన్నారు. విశాఖ, భీమిలిరోడ్డు మార్గంలో రామ నాయుడుగారి స్టూడియో సమీపం లో గతంలో కేటాయించిన 316 ఎకరాల స్థలంలో స్టూడియోలు నిర్మించేం దుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

ఇందుకు ఎకరం రూ. 50 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించినందున దాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఏవీఏం సంస్థలు స్టూడియోల నిర్మాణానికి దరఖాస్తు చేశాయన్నారు. సీఎం చంద్రబాబు ఇందుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సినిమా థియేటర్లు కొందరి చేతిలోనే ఉన్న విషయం వాస్తవమేనని.. వారికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న లాభం ఏమీలేదన్నారు. రోజుకు 5 ఆటలు వేయడం వలన పెద్ద స్టార్స్ మూవీ తొలి రోజు వసూళ్లు పరవాలేదు కానీ, ఆ తరువాత ఒకోసారి షోస్ రద్దు చేయడం కూడా జరుగుతుంది. రోజు ప్రదర్శించే నాలుగు ఆటలలో ఒక షో తప్పని సరిగా చిన్న సినిమా వేసేలా మీరు (జర్నలిస్టులు) ఇచ్చిన సూచనా మేరకు ఏ పి యఫ్ డి సి ఆలోసిస్తుందని, 5 సంవత్సరాల టి వి నందీ అవార్డులు ఒకే సారి నవంబర్ డిసెంబర్‌లలో భారీ ఎత్తున ప్రధానోత్సవం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ పత్రికా సమావేశం లో ప్రభుత్వ మేనేజర్ సాయి, అంబికా రామచంద్ర రావు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All