Homeన్యూస్ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్ YSR షాదీ తోఫా

ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్ YSR షాదీ తోఫా

 ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్ YSR షాదీ తోఫా
ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్ YSR షాదీ తోఫా

ఏపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టింది. YSR షాదీ తోఫా స్కీమ్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. తన నియోజకవర్గం ఎక్కువగా ఉన్న ముస్లింలకు లబ్ది చేకూరాలన్న లక్ష్యంతో ఇలా వినూత్నంగా శ్రీకారం చుట్టారు. ఏకంగా ఒక ముస్లిం జంటకు డెమో మారేజ్ చేసి అక్కడే ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ షాది తోఫా పేరుతో లక్ష రూపాయల చెక్కును ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి స్టేజీని కూడా వేశారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అయితే అందరి దృష్టిలో పడుతుందనుకున్నారు. సాధారణంగా పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు అన్నింటినీ చేశారు. పెళ్లి మండపాన్ని నిర్మించి మేళతాళాలను ఏర్పాటు చేశారు.

డెమో కోసమే కాబట్టి అప్పటికే ఇటీవల వివాహం అయిన ఒక ముస్లిం జంటను తీసుకొచ్చి పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా వివాహం చేయించారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది ముస్లిం పెద్దలు.. వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత అందరి సమక్షంలో.. ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్‌ను చేతులో పెట్టారు. అందరికీ కనిపించేంత పెద్ద సైజ్‌లో ఏర్పాటు చేసి లక్ష రూపాయల మొత్తాన్ని ఇస్తున్నట్టు ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద చెక్కును ఇచ్చారు. ప్రభుత్వ పరంగా చూస్తే ఇదంతా బానే ఉంది. కానీ దీనిపై కొంతమంది ముస్లిం మత పెద్దలు తప్పుబడుతూ విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాలా సీరియస్ అభియోగాలు కుడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

ముస్లిం వివాహాల్లో పెళ్లి అయ్యే వరకు వధూవరులు చూసుకోకూడదు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. కొత్త జంటను అందరికీ చూపిస్తూ చేసిన తతంగమంతా.. తమ సంప్రదాయాల్ని అపహస్యం చేసిందంటున్నారు మత పెద్దలు. అందులోనూ పెళ్ళిళ్ళు సంప్రదాయ బద్దంగా వివాహ వేదికల్లో జరుగుతాయి.. ఇక్కడ మాత్రం నడిరోడ్డు పై వివాహం చేయడం తమ మనోభావాలను గాయపరిచాయంటున్నారు మత పెద్దలు. ముస్లిం మనోభవాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసూపల్లి గణేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు మత పెద్దలు. ఇలాంటివి మళ్లీ భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ పరంగా ఇలా చేయాలని కూడా ఎక్కడా లేదంటున్నారు ముస్లిం మత పెద్దలు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫిర్యాదు వెనుక వైసీపీకే చెందిన కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారన్నది ఎమ్మెల్యే వర్గం వాదన. వీళ్లద్దరూ మొదటి నుంచి వాసుపళ్లి గణేష్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు తెలియకుండా కార్యక్రమం చేస్తారా? అన్న కోపంతో ఎమ్మెల్యేపై కక్షకట్టారని ఆయన వర్గం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా దాన్ని వివాదం చేయడం ద్వారా మైనారిటీల్లో వాసుపల్లి ప్రతిష్టను తగ్గించవచ్చన్న ఆలోచన, కుట్ర ఉందన్నది ఎమ్మెల్యే అనుచరుల అనుమానం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All