Homeటాప్ స్టోరీస్అడ్డంగా బుక్కై మోస‌పోయిన‌ నితిన్ డైరెక్ట‌ర్!

అడ్డంగా బుక్కై మోస‌పోయిన‌ నితిన్ డైరెక్ట‌ర్!

అడ్డంగా బుక్కై మోస‌పోయిన‌ నితిన్ డైరెక్ట‌ర్!
అడ్డంగా బుక్కై మోస‌పోయిన‌ నితిన్ డైరెక్ట‌ర్!

ఎంత జాగ్ర‌త్త‌గా వున్నా.. ఎంత ఇంటలిజెంట్‌గా వున్నా ఆద‌మ‌రిచి ఏమ‌ర‌పాటుగా వుంటే మోస‌పోవ‌డం ఖాయం అని మ‌రోసారి నిరూపించ‌బ‌డింది. హీరో నితిన్ డైరెక్ట‌ర్ అడ్డంగా బుక్కై మోస‌పోయిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నాగ‌శౌర్య హీరోగా న‌టించి `ఛ‌లో` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చారు యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌.

ఈ మూవీ త‌రువాత గ‌త ఏడాది ప్రారంభంలో `భీష్మ‌`తో సాలీడ్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అదే వుత్సాహంతో ఓ స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ నేప‌థ్యంలో నితిన్ న‌టించిన `భీష్మ‌` చిత్రం ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల‌కు ఎంపికైంద‌ని ఓ అజ్ఞాత‌వ్య‌క్తి వెంకీ కుడుముల‌కు ఫోన్ చేసి చెప్పార‌ట‌.

- Advertisement -

ఏ ఏ విభాగాల్లో సినిమా ఎంపికైందో వివ‌రించార‌ట కూడా. దీంతో అత‌న్ని వెంకీ కుడుముల గుడ్డిగా న‌మ్మేశార‌ట‌. అయితే ఒక్కో విభాగానికి గానూ 10 వేలు క‌ట్టాల‌ని మొత్తంగా 63 వేలు త‌న అకౌంట్‌కి ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌మ‌ని స‌ద‌రు వ్య‌క్తి త‌న అకౌంట్ డిటేయిల్స్ పంపించార‌ట‌. వెంట‌నే ఆ అకౌంట్‌కి వెంకీ కుడుముల 63 వేలు ట్రాన్స్ ఫ‌ర్ చేశార‌ట‌. త‌రువాత ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ కాల్ అని, త‌ను మోస‌పోయాని తెలిసింద‌ట‌. దీంతో సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ని వెంకీ కుడుముల ఆశ్ర‌యించడంతో పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All