
నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `భీష్మ`. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న నితిన్‌కు సాలీడ్ హిట్‌ని అందించి ఆ సంబరాన్ని మరింత రెట్టింపు చేసింది. రష్మక మందన్నతో నితిన్ కెమిస్ట్రీ, అంతర్లినంగా ఈ సినిమా ద్వారా చెప్పిన సందేశం ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
చాలా రోజులుగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కి మంచి విజయాన్ని అందించి మళ్లీ సక్సెస్ బాట పట్టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మధ్య తెలుగులో హిట్ అయిన చిత్రాలపై బాలీవుడ్ హీరోలు ఆసక్తిని చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే `అర్జున్‌రెడ్డి` బాలీవుడ్‌లో `కబీర్‌సింగ్` పేరుతో రీమేక్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం `జెర్సీ` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
తాజాగా `భీష్మ` చిత్రాన్ని రణ్‌బీర్ కపూర్‌తో రీమేక్ చేయాలని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా న్యూస్. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, శంషేరా` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే `భీష్మ` రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటికి రానున్నట్టు తెలిసింది.