Homeటాప్ స్టోరీస్తమిళ్ సినిమా హిట్టు

తమిళ్ సినిమా హిట్టు

96 tamil film gets hit talkఅగ్ర నిర్మాత దిల్ రాజు గతకొంత కాలంగా వరుస పరాజయాలను చవిచూస్తూ ఆర్ధికంగా , హార్దికంగా ఇబ్బంది పడుతున్నాడు కాగా ఆచి తూచి జాగ్రత్తపడి తమిళ హక్కులు కొన్న సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది దాంతో దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిత్రిష కాంబినేషన్ లో తమిళంలో తెరకెక్కిన చిత్రం ”96”. కాగా ఈ చిత్రం నిన్న విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది . అంతేకాదు మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంది దాంతో దిల్ రాజు ఆనందం అంతా ఇంతా కాదు . ట్రైలర్ విడుదలైన సమయంలోనే 96 చిత్రానికి ప్రశంసలు దక్కాయి . దానికి తోడు విజయ్ సేతుపతి హీరో కావడంతో నమ్మకంతో తెలుగు రీమేక్ హక్కులు పొందాడు దిల్ రాజు .

టాక్ బాగుండటంతో వసూళ్లు కూడా పెరిగాయి 96 తమిళ చిత్రానికి . ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అర్జున్ లేదా నాని లలో ఎవరో ఒకరితో రీమేక్ చేయాలనీ ఉత్సాహపడుతున్నాడు దిల్ రాజు . నాని కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నాడు దానికి తోడు హిట్ అయ్యేసరికి ఖచ్చితంగా చేయాలనీ అనుకుంటాడు . మరి దిల్ రాజు మదిలో ఏముందో ! అల్లు అర్జున్ సలహా తీసుకొని అతడితోనే చేస్తాడా ? లేక నాని తో 96 చిత్రాన్ని రీమేక్ చేస్తాడా చూడాలి .

- Advertisement -

English Title: 96 tamil film gets hit talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All