Homeటాప్ స్టోరీస్బయ్యర్లకు 90 కోట్ల నష్టం మిగిల్చిన కాలా

బయ్యర్లకు 90 కోట్ల నష్టం మిగిల్చిన కాలా

90 crores loss for kaala buyersసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 165 కోట్ల బిజినెస్ జరిగింది , కానీ ఇప్పుడు బయ్యర్లకు తిరిగి వచ్చిన సొమ్ము 75 కోట్లు మాత్రమే అంటే 90 కోట్లు నష్టపోయారు ఆ సినిమాని కొన్న బయ్యర్లు . ఇక తెలుగులో 33 కోట్లకు కాలా హక్కులు పొందగా కేవలం ఏడున్నర కోట్లు మాత్రమే షేర్ వచ్చింది అంటే దాదాపు 22 కోట్ల నష్టం అన్నమాట తెలుగు బయ్యర్లకు , తెలుగు హక్కుదారుడి కి .

రజనీకాంత్ నటించిన చిత్రాలు గతకొంత కాలంగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి అయినప్పటికీ అతడికి ఉన్న క్రేజ్ వల్ల భారీ ఎత్తున బిజినెస్ జరుగుతూనే ఉంది . పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించాడు . పా రంజిత్ తో ఇంతకుముందు కబాలి సినిమా చేసాడు రజనీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది . అయినప్పటికీ మళ్ళీ పా రంజిత్ కు ఛాన్స్ ఇచ్చాడు కానీ రెండో అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక పోయాడు పా రంజిత్ . కాలా ప్రపంచ వ్యాప్తంగా కొనుకున్న బయ్యర్లకు చుక్కలు చూపించింది . ఏకంగా 90 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది , 165 కోట్ల షేర్ వసూల్ కావాల్సి ఉండే కానీ 75 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . అయితే ధనుష్ కు మాత్రం పెట్టిన పెట్టుబడి వచ్చింది . కొనుకున్న బయ్యర్లే నష్టపోయారు .

- Advertisement -

English Title: 90 crores loss for kaala buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All