Homeటాప్ స్టోరీస్24 కిస్సెస్ రివ్యూ

24 కిస్సెస్ రివ్యూ

24 kisses movie review
24 కిస్సెస్ రివ్యూ

24 కిస్సెస్ రివ్యూ :
నటీనటులు : అరుణ్ ఆదిత్ , హెబ్బా పటేల్
సంగీతం : జాయ్ బరువ
నిర్మాత : సంజయ్ రెడ్డి
దర్శకత్వం : అయోధ్య కుమార్
రేటింగ్ : 2/5
రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2018

 

- Advertisement -

హాట్ భామ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ” 24 కిస్సెస్ ” . అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

చిల్డ్రన్స్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్ ( అరుణ్ ఆదిత్ ) అమ్మాయిల పట్ల వ్యామోహం ఉన్నవాడు , అతడికి శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్ ) పరిచయం అవుతుంది . ఆ పరిచయం కాస్త ముదిరి మరింత ముందుకు వెళ్తారు ఆనంద్ – శ్రీలక్ష్మి లు . అయితే ఆనంద్ తనని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది శ్రీలక్ష్మి కానీ ఆనంద్ యూజ్ అండ్ త్రో అనే విషయం తెలుసుకొని షాక్ అవుతుంది . తనతోనే కాకుండా ఆనంద్ కు ఇంకా చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని తెలుసుకుని ఆనంద్ కు దూరం అవుతుంది . శ్రీలక్ష్మి దూరమయ్యాక ఆనంద్ మారాడా ?తన తప్పు తెలుసుకొని శ్రీలక్ష్మి కి దగ్గరయ్యాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

హెబ్బా పటేల్ గ్లామర్
అరుణ్ ఆదిత్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

హెబ్బా పటేల్ నటన కంటే గ్లామర్ తో అలరించింది . యూత్ కు కావాల్సిన మసాలా అందించింది హెబ్బా పటేల్ . అలాగే అరుణ్ ఆదిత్ తో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించి మంచి కిక్ ఇచ్చింది . అరుణ్ ఆదిత్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . రావు రమేష్ , నరేష్ తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

రొమాన్స్ ప్రధానాంశంగా తీర్చి దిద్దాలని అనుకున్నాడు దర్శకుడు అయితే రొమాన్స్ ని దట్టంగా అందించాడు కానీ ఎంటర్ టైన్ మెంట్ ని ఎమోషన్ ని మాత్రం పండించలేకపోయాడు . దాంతో రొమాంటిక్ సీన్స్ తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏవి లేకపోవడం , స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ . దర్శకుడు 24 కిస్సెస్ ని జనరంజకంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు . నిర్మాణ విలువలు ఫరవాలేదు , ఉదయ్ ఛాయాగ్రహణం బాగుంది , అయితే సంగీత పరంగా చాలా మైనస్ అనే చెప్పాలి .

ఓవరాల్ గా :

రొమాన్స్ ఇష్టపడే వాళ్లకు కాస్త టైం పాస్ అంతే !

English Title: 24 kisses movie review

                                           Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All