Homeటాప్ స్టోరీస్హమ్మయ్య ! రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

హమ్మయ్య ! రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

2.0 release date fixedసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన రోబో సీక్వెల్ చిత్రం ” 2. 0” ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది . ఈ ఏడాది నవంబర్ 29న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారికంగా తెలిపాడు దర్శకుడు శంకర్ . 2. 0 చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఏడాది పూర్తయ్యింది ఇక సినిమా విడుదల అని పలుమార్లు ప్రకటించారు అయితే తీరా సమయానికి గ్రాఫిక్ వర్క్ ఇంకా కాలేదు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేశారు కట్ చేస్తే ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు దర్శకుడు శంకర్ .

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు . అయితే గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి . తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన లింగ , కాలా , కబాలి , కొచ్చాడైయాన్ , కథానాయకుడు తదితర చిత్రాలు బయ్యర్ల ని నట్టేట ముంచాయి దాంతో రోబో సీక్వెల్ హిట్ అవుతుందా భారీ బడ్జెట్ ని బ్రేక్ చేస్తుందా ? అని .

- Advertisement -

రజనీకాంత్ సరసన హాట్ భామ అమీ జాక్సన్ నటించగా విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు . ఇక నవంబర్ 29న విడుదల తేదీ డిసైడ్ కావడంతో మొత్తానికి ఊపిరి పీల్చుకుంటున్నారు బయ్యర్లు .

English Title: 2.0 release date fixed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts