Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ కాలా ఆన్ లైన్ లో లీక్ అయ్యింది

రజనీకాంత్ కాలా ఆన్ లైన్ లో లీక్ అయ్యింది

rajinikanth kaala movie leaked సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా కష్టాలు తప్పలేదు , ఆన్ లైన్ లో ఆ సినిమా లైవ్ స్ట్రీమింగ్ పెట్టి సంచలనం సృష్టించాడు ఓ అభిమాని . కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదల అవుతున్నప్పటికీ , ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి అందునా సింగపూర్ లో రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ ముందుగానే షో వేశారు . అయితే ఆ సినిమాకు వెళ్లిన ప్రవీణ్ దేవర అనే వ్యక్తి కాలా చిత్రాన్ని దాదాపు 45 నిమిషాల పాటు ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చేసాడు .

ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ పోలీసులు ప్రవీణ్ దేవర ని అదుపులోకి తీసుకొని ఫేస్ బుక్ లైవ్ ని ఆపేసారు . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది . పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ” కాలా ” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతకొంత కాలంగా రజనీకాంత్ కు సరైన హిట్ సినిమా లేదు దాంతో ఈ కాలా పై ఆశలు పెట్టుకున్నాడు . మొదటి రోజున భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అయితే సినిమా బాగుంటే రికార్డులు బద్దలు అవుతాయి లేదంటే షరా మామూలే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All