
వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నిఖిల్ – అనుపమలు ప్రస్తుతం 18 పేజెస్ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా..బుధువారం ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.
‘నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు’ అని నిఖిల్ చెప్పడంతో గ్లింప్స్ మొదలైంది. సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ నటించగా.. కవితలు రాసే యువతి నందినిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.