
యూట్యూబ్ లో ఎత్తర జెండా సాంగ్ దూసుకుపోతుంది. ఎన్టీఆర్ , రాజమౌళి , రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్. యావత్ సినీ అభిమానులతో పాటు యావత్ ప్రజానీకం ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25 న దాదాపు 18 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 15 మిలియన్ల వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. మిగతా కీలక పాత్రల్లో అలియా భట్ ఒలివియా మోరీస్ రే స్టీవెన్ సన్ అలీసన్ డూడీ సముద్రఖని కనిపించబోతున్నారు.
- Advertisement -
- Advertisement -