Homeటాప్ స్టోరీస్101 జిల్లాల అందగాడు: బట్టతలపై దండయాత్ర

101 జిల్లాల అందగాడు: బట్టతలపై దండయాత్ర

101 jillala andagadu trailer is decent
101 jillala andagadu trailer is decent

నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా రాణించిన శ్రీనివాస్ అవసరాల కొంత గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా 101 జిల్లాల అందగాడు. తానే ఈ సినిమాకు కథ అందించగా రాచకొండ విద్యాసాగర్ డైరెక్ట్ చేసాడు. క్రిష్ మరియు దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది.

బట్టతల ఉండే ఒక వ్యక్తి సమాజంలో ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చుస్తే అర్ధమైంది. బట్టతలను దాచుకుంటూ విగ్ పెట్టుకుని బయట మ్యానేజ్ చేసే హీరోగా శ్రీనివాస్ అవసరాల నటించాడు. బట్టతలపై సాగించే పోరాటం, ఆ హీరో ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో కథ సాగుతుందని అర్ధమవుతోంది. కామెడీ ప్రధానంగా సాగినా కూడా ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేశారు.

- Advertisement -

మొత్తానికి 101 జిల్లాల అందగాడు ట్రైలర్ తో మెప్పించింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకూ ఆగక తప్పదు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All