Homeటాప్ స్టోరీస్హిట్లర్ గారి పెళ్ళాం’ అనే సరికొత్త సీరియల్‌తో మన ముందుకు రాబోతున్న జీ తెలుగు

హిట్లర్ గారి పెళ్ళాం’ అనే సరికొత్త సీరియల్‌తో మన ముందుకు రాబోతున్న జీ తెలుగు

Zee Telugu to woo viewers with ‘Hitler Gari Pellam’,latest fiction launch
Zee Telugu to woo viewers with ‘Hitler Gari Pellam’,latest fiction launch

జీ తెలుగు ఛానల్‌ బ్రాండ్‌ ఫిలాసఫీ ‘ఆరంభం ఒక్క అడుగుతోనే’. ఈ సూత్రాన్ని అనునిత్యం ఆచరిస్తూ అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్‌తో మీ ముందుకు వస్తోంది జీ తెలుగు ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీలలో.

భానుమతి ఏది చేసినా అది తనకే అడ్డం తిరుగుతుంది. పని సాధించడానికై వెళుతుంది కానీ తను అధోగతి పాలవుతుంది. అందుకే భానుమతి కుటుంబసభ్యులు కూడా ‘భాను, నీ వల్ల కాదు!’ అని అంటారు. మరి అలాంటి భానుమతి ఒక ఇంటికి అత్త అయితే? వయసులో తన కన్నా పెద్దవాళ్ళైన ముగ్గురి కోడళ్లతో ఎలా మసులుకుంటుందో తెలుసుకోవాలంటే హిట్లర్ గారి పెళ్ళాం చూడాల్సిందే.

- Advertisement -

సీరియల్స్‌ అన్నీ ఒకేలా ఉండవు. ఈ సీరియల్ కూడా అలాంటిదే. ముగ్గురు కోడళ్ళు వారి వారి స్వార్థం కోసం మామగారైన హిట్లర్, అభినవ్ జాగర్లమూడి (ఏజే) తో భానుమతి పెళ్లి జరిపిస్తారు. మరి భానుమతి పెద్దింటికి అత్తగా, హిట్లర్ కి భార్యగా, తను చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతుందా? తనలోని లోపాలని అధిగమిస్తూ, ‘పరిపూర్ణత’ అంటే ఏంటని అందరికి తెలుపుతూ, తన ప్రేమను ఎలా పొందుతుందో చెప్పే కథే హిట్లర్ గారి పెళ్ళాం.

హిట్లర్ గారి పెళ్ళాం లో అభినవ్ గా, టెలివిషన్ శోభన్ బాబు గా పిలవబడే నిరుపమ్ పరిటాల హీరో గా నటింస్తున్నాడు. నిరుపమ్ అభిమానులు తన ‘హిట్లర్’ వేషధారణకి మంత్రముగ్ధులయిపోయారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అలాగే, భానుమతి పాత్రలో గోమతి ప్రియా నటిస్తుంది. వీరితో పాటు, సునంద మాలశెట్టి, కీర్తి జైధనుష్, మధుకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలలో ప్రేక్షకులని అలరింపచేయనున్నారు.

జీ టీవీ యొక్క ‘గుడ్డన్ తుమ్సే న హో పాయెగా’ అనే సీరియల్ కధాంశంతోటి మన అందరిని అలరించడానికి వస్తుంది హిట్లర్ గారి పెళ్ళాం. ‘గుడ్డన్ తుమ్సే న హో పాయెగా’ అభిమానులు సీరియల్ ప్రోమో చూసినప్పటినుంచి సోషల్ మీడియాలో వారి ఆసక్తి ని వ్యక్తపరుస్తూ ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ వారి ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. భానుమతి తన లోపాలను ఎలా జయించగలదో మనకు చూపించడానికి 360 డిగ్రీస్ ప్రమోషనల్ కార్యాచరణలతోటి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతుంది మన జీ తెలుగు.

ఏ విధంగా మరి భాను హిట్లర్ మనసుని, తన కోడళ్ళని, అలాగే తన లోపాలని గెలుస్తుందో చూడాలంటే హిట్లర్ గారి పెళ్ళాం ఆగస్టు 17 సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీలలో.

మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి. మేము అందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All