Homeటాప్ స్టోరీస్5 కోట్ల ఆఫర్ ఇస్తున్నాడు

5 కోట్ల ఆఫర్ ఇస్తున్నాడు

young hero nikhil gouda bumper offer to directorsతనతో సినిమా తీస్తే టాలీవుడ్ డైరెక్టర్ కు 5 కోట్ల నజరానా ఇస్తానని అంటున్నాడు కన్నడ హీరో నిఖిల్ గౌడ . కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడైన నిఖిల్ గౌడజాగ్వార్ ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు . కన్నడ , తెలుగు బాషలలో జాగ్వార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు . తెలుగు దర్శకుడు మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది దాంతో ఈ యంగ్ హీరోతో సినిమా చేయడానికి మన దర్శకులు వెనకడుగు వేశారు . సురేందర్ రెడ్డి కి భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ అతడితో సినిమా చేయడానికి నో చెప్పాడు .

దాంతో తాజాగా ఈ ఆఫర్ ఇస్తున్నాడు నిఖిల్ గౌడ . కర్ణాటక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఈసారి ఎవరైనా మంచి పేరున్న దర్శకులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాడు ఈ హీరో మరి ఎవరు వస్తారో ? ఎవరు సినిమా చేస్తారో చూడాలి . మంచి కథ తీసుకొని రండి 5 కోట్లు అందుకోండి అని అంటున్నాడు కానీ పేరున్న దర్శకులే కావాలని అంటున్నాడు దానివల్ల టాలెంట్ ఉన్న వాళ్ళు కుమారస్వామి కంపౌండ్ లోకి వెళ్లే ఛాన్స్ లేదు . టాలెంట్ ఉన్న వాళ్లతో చేస్తే బాగానే ఉంటుంది మరి . ఆ దిశగా ఆలోచిస్తాడో…. లేదో !

- Advertisement -

English Title: young hero nikhil gouda bumper offer to directors

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All