Homeటాప్ స్టోరీస్కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్డీ

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్డీ

yeddyurappa-swearing-as-karnataka-chief-ministerకర్ణాటక ముఖ్యమంత్రిగా ఎట్టకేలకు యడ్యూరప్ప (75) ప్రమాణ స్వీకారం చేసారు . ఈరోజు ఉదయం 9 గంటలకు రాజ్ భవన్ లో యడ్యూరప్ప అనే నేను అంటూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు . భారతీయ జనతా పార్టీ కి 104 స్థానాలు మాత్రమే దక్కాయి దాంతో కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఉత్కంఠ నెలకొంది . అయితే గవర్నర్ అతిపెద్ద పార్టీ అయిన బిజెపి ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాడు .

ఎన్నో ఆటుపోట్ల ని ఎదుర్కొన్న యడ్యూరప్ప మూడోసారి కర్ణాటక ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు . కాంగ్రెస్ – జేడీఎస్ లు సుప్రీం కోర్టు కి ఎక్కడంతో యడ్యూరప్ప 15 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది , 15 రోజుల తర్వాత శాసనసభ లో మెజారిటీ నిరూపించుకోని యెడల రాజీనామా చేయాల్సి ఉంటుంది , ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది . చూడాలి 15 రోజుల్లో కర్ణాటకలో ఏమౌతుందో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All