
కిజిఎఫ్ 2 చిత్రం ఫై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కు వరుసపెట్టి చిత్ర నటి నటులు , దర్శకులు రిప్లై ఇస్తున్నారు. ‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. మీ కృషి, అంకిత భావం నుంచే నేను స్ఫూర్తి పొందాను. మీరు ఎప్పుడు ఇంతే గొప్పగా ఉండండి’’ అని యశ్ రిప్లై ఇవ్వగా.. ‘‘థ్యాంక్ యూ సర్’’ అంటూ శ్రీ నిధి శెట్టి , ‘‘మీరు సినిమాను మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. మీ ప్రోత్సాహానికి థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్’’ అని ప్రశాంత్ నీల్, ‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. నేను నీకు పెద్ద అభిమానిని. ‘పుష్ప’ లో నీ నాటన నాకెంతో ఇచ్చింది. అటువంటి చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా’’ అని రవీనా టండన్ లు రిప్లైలు ఇచ్చారు.
ఇక బన్నీ మూవీ ఫై ఎలా స్పందించాడంటే.. ‘కెజియఫ్’ చిత్రబృందానికి అభినందనలు. యశ్, సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీ నిధి శెట్టిలు తమ నటనతో ఆకట్టుకున్నారు. రవిబస్రూర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. భువనగౌడ విజువల్స్‌తో మాయ చేశాడు. ఇతర టెక్నిషన్లు కూడా బాగా పనిచేశారు. తన విజన్‌ను ఎంతగానో నమ్మి ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. భారతీయ సినిమా స్థాయిని పెంచుతున్నందుకు, మంచి సినిమా అనుభూతిని అందించినందుకు థ్యాంక్ యూ’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.