Homeఎక్స్ క్లూసివ్శ్రీమతి ఆశాభోస్లేకు టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్

శ్రీమతి ఆశాభోస్లేకు టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్

భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు శ్రీ టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తర్వాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుండీ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్ ను సినీ ప్రముఖులకు అందచేస్తున్నారు. ఈ సారి 2017కి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు అంద చేయబోతున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి… శ్రీమతి ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు.
గతంలో ఈ అవార్డును శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ అమితాబ్ బచ్చన్, శ్రీమతి రేఖ, శ్రీ షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017’ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 
1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ ప్రాయంలోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలు ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్’ మరో కలికితురాయిగా నిలువబోతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All