Homeటాప్ స్టోరీస్ఆ బుర్ర కథ వింటారా ? చూస్తారా ?

ఆ బుర్ర కథ వింటారా ? చూస్తారా ?

Writer diamond ratna turned directorతెలుగులో పలు హిట్ చిత్రాలకు కథ అందించిన వ్యక్తి డైమండ్ రత్నం , కాగా ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు . ఎన్నాళ్ళు గానో దర్శకుడిగా అవతారం ఎత్తాలని చూస్తున్నాడు కానీ కాలం కలిసి రాలేదు కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ ఛాన్స్ వచ్చింది దాంతో ” బుర్ర కథ ” వినిపించడానికి , చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . బుర్రకథ వినిపించడం , చూపించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? డైమండ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి పెట్టిన పేరు ” బుర్రకథ ” . అదన్నమాట అసలు విషయం .

ఇక ఈ సినిమాలో హీరోగా ఆది నటించనున్నాడు . సాయి కుమార్ తనయుడిగా తెరంగేట్రం చేసిన ఆది అనుకున్న స్థాయిలో విజయాలను దక్కించుకోలేక పోయాడు . ఇప్పటికి సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఆది . మరి ఇప్పుడు డైమండ్ రత్నం బుర్రకథ తో హిట్ కొడతాడా ? లేదా ? చూడాలి . అలాగే దర్శకుడిగా మారిన డైమండ్ రత్నం కు కూడా ఈ సక్సెస్ చాలా అవసరం ఎందుకంటే రచయితగా హాయిగా ఉండే పనిని వదిలేసి డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయితేనే పేరు లేదంటే రచయితగా కూడా తీసుకోరు ఫెయిల్ అయితే .

- Advertisement -

English Title: writer diamond ratna turned director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All