
పురిచ్చితలైవి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా `తలైవి` పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. తమిళ, హిందీ భాషల్లో దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ మోస్ట్ డేంజరస్ హీరోయిన్ కంగనా రనౌత్ దివంగత జయలలితగా నటిస్తోంది. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ని, జయలలిత లుక్‌ని రిలీజ్ చేశారు. టీజర్‌లో యంగ్ జయలలితగా కంగన ఒదిగిపోయి కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్నిపెంచేసింది. అయితే ఈ చిత్రాన్ని తను రాసిన బుక్ ఆధారంగా నిర్మిస్తున్నారని, టైటిల్స్‌లో కనీసం తనకు క్రెడిట్ ఇవ్వలేదని తమిళ రచయిత అజయన్ బాలా దర్శకుడు ఏ.ఎల్. విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇది తనకు జరిగిన అవమానమని, ఈ అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని, ఆరు నెలల పాటు తాను శ్రమించి ఈ కథని రాసుకున్నానని, ఈ సినిమాపై ఒకరు కేసు వేస్తే తన బుక్‌ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నారని, కానీ తన పేరుని మాత్రం టైటిల్స్‌లో వేయలేదని అజయన్ బాలా మండి పడుతున్నారు. మరి దీనిపై దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.