Homeటాప్ స్టోరీస్ఫిబ్రవరిలో మన ముందుకు రానున్న సినిమాలివే!

ఫిబ్రవరిలో మన ముందుకు రానున్న సినిమాలివే!

ఫిబ్రవరిలో మన ముందుకు రానున్న సినిమాలివే!
ఫిబ్రవరిలో మన ముందుకు రానున్న సినిమాలివే!

డిసెంబర్ ప్యాక్ అయిపోయింది. డిసెంబర్ 5న కార్తికేయ నటించిన 90ml సినిమా విడుదలవుతుంటే, డిసెంబర్ 6న కమెడియన్ శ్రీనివాస రెడ్డి దర్శకనిర్మాతగా మారి హీరోగా కూడా చేసిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా వస్తోంది.ఇక ఇప్పటిదాకా నిరసించిపోయిన థియేటర్లకు కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఆ తర్వాత వారం నుండి వస్తున్నాయి. డిసెంబర్ 13న వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ వెంకీ మామ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 20న క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ ఉండడంతో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే, నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా రూలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక డిసెంబర్ 25న రాజ్ తరుణ్ నటించిన లవ్ స్టోరీ ఇద్దరి లోకం ఒకటే వస్తోంది.

ఇది అయిపోయాక సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాల హంగామా మొదలైపోయింది. డిసెంబర్ 9న రజినీకాంత్ దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జనవరి 11న మహేష్ 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల్లు అర్జున్ లేటెస్ట్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 15న నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా ద్వారా కామ్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. సంక్రాంతి హంగామా అయిపోయాక రిపబ్లిక్ డే హాలిడేకి జనవరి 24న మాస్ మహారాజా సినిమా డిస్కో రాజా విడుదల కానుంది. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ జనవరి 25న అనుష్క సైలెంట్ థ్రిల్లర్ నిశ్శబ్దం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అవకాశముంది. ఇలా డిసెంబర్, జనవరి నెలలు వరస సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్న నేపథ్యంలో అన్ సీజన్ అయినా కూడా ఫిబ్రవరికి కూడా క్రేజ్ ఉన్న సినిమాలే మన ముందుకు రానున్నాయి.

- Advertisement -

ముందుగా ఫిబ్రవరి 7న శర్వానంద్, సమంత కలిసి నటించిన 96′ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తైపోయినా సరైన రిలీజ్ డేట్ కోసం ఫిబ్రవరికి వాయిదా వేసాడు నిర్మాత దిల్ రాజు. ఇక ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కూడా విజయ్ దేవరకొండ ముందు డియర్ కామ్రేడ్ ను పూర్తి చేయడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రం ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి మంచి సినిమాను తీసిన క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఫిబ్రవరి 21న నితిన్, రష్మిక మందన్న కలిసి నటించిన భీష్మ ప్రేక్షకులను పలకరించనుంది. ఛలో తో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల దీనికి దర్శకుడు. ఇలా ఫిబ్రవరిలో కూడా ఆసక్తికర సినిమాలే విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని విజయాలు సాధిస్తాయో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All