Homeటాప్ స్టోరీస్చిన్న పిల్లాడి ఫోన్ ని పగులగొట్టిన అనసూయ

చిన్న పిల్లాడి ఫోన్ ని పగులగొట్టిన అనసూయ

హాట్ భామ అనసూయ కు కోపం రావడంతో తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటున్న ఓ చిన్న పిల్లాడి ఫోన్ ని తన చేతుల్లోకి లాక్కొని రోడ్డు కేసి కొట్టి పగులగొట్టింది దాంతో ఆ పిల్లాడు తీవ్ర షాక్ కి గురయ్యాడు అయితే ఈ తతంగమంతా కొంత దూరంలో ఉండి చూస్తున్న ఆ పిల్లాడి తల్లికి చిర్రెత్తుకొచ్చింది అంతే శివాలున వెళ్లి అనసూయ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ అప్పటికే అనసూయ ఆవేశంతో ఊగిపోతూ అక్కడి నుండి కారెక్కి వెళ్ళిపోయింది . తమ ఫోన్ పగులగొట్టడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనా ఆ పిల్లాడి తల్లి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది .

తమ ఫోన్ ని అకారణంగా పగులగొట్టిన అనసూయ పై కేసు నమోదు చేయాలనీ పట్టుబట్టింది . అయితే పోలీసులు మాత్రం అనసూయ పైన కేసు నమోదు చేయలేదు కానీ ఫిర్యాదు ని మాత్రం స్వీకరించారు . ఇటీవల వ్యక్తిగత పని మీద తార్నాక వెళ్ళింది అనసూయ అప్పుడు ఈ సంఘటన జరిగింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All