
బాహుబలి మూవీ తో తెలుగు సినిమా సత్తా ఏంటో వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి..ఇప్పుడు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారు. ఈ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. మార్చి 25 న పలు భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను మొదటి రోజున చూడాలని అభిమానులు , సినీ లవర్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో పేటీఎమ్ కేవలం రూ.1 కే ఆర్ఆర్ఆర్ టికెట్ పొందవచ్చని తెలిపింది.
ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌కి రూ. 1 పంపిస్తే రూ.150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. ఇంకా, మరో విషయం ఏమిటంటే మీరు పేటీఎమ్ జెనీకి పంపిన రూ.1ని కూడా తిరిగి మీ ఖాతాలో రీఫండ్ చేయనున్నట్లు తెలిపింది. అంటే, ఉచితంగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది