Homeటాప్ స్టోరీస్విజయ్ 14 కోట్లు వసూల్ చేయగలడా ?

విజయ్ 14 కోట్లు వసూల్ చేయగలడా ?

Will vijay collect 14 crores with sarkar in teluguతమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో అంతగా క్రేజ్ లేదు , తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు అయితే తెలుగులో మాత్రం అంతగా స్టార్ డం లేదు , ఫ్యాన్స్ కూడా లేరు దాంతో సర్కార్ సినిమా 14 కోట్ల భారీ మొత్తాన్ని వసూల్ చేయగలదా ? అన్న అనుమానం నెలకొంది ఎందుకంటే సర్కార్ చిత్రాన్ని తెలుగులో 7 కోట్లకు కొన్నారు . అంటే బయ్యర్లకు కానీ , నిర్మాతలకు కానీ లాభాలు రావాలంటే ఏకంగా 14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి అప్పుడే 7 కోట్ల పైచిలుకు షేర్ వస్తుంది .

అంత పెద్ద మొత్తం విజయ్ తెలుగునాట వసూల్ చేయడం కష్టమే ! కాకపోతే విజయ్ కున్న అదృష్టం ఏంటంటే ……. సవ్యసాచి తప్ప మరో సినిమా ఏది కూడా పోటీ లేదు . సవ్యసాచి నాగచైతన్య హీరో కాబట్టి భారీ పోటీ అయితే ఉండదు దాంతో వారం రోజుల పాటు విజయ్ కి మంచి సమయం కలిసి వస్తోంది దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా ఆ మొత్తాన్ని వసూల్ చేయొచ్చు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రం వివాదం నుండి బయటపడి మొత్తానికి నవంబర్ 6 న విడుదల అవుతోంది . బయ్యర్లకు లాభాలు వచ్చేలా వసూల్ చేస్తాడా ? అన్నది చూడాలి .

- Advertisement -

English Title: Will vijay collect 14 crores with sarkar in telugu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All