Homeటాప్ స్టోరీస్మాఫియా డాన్ గా శర్వానంద్ మెప్పిస్తాడా

మాఫియా డాన్ గా శర్వానంద్ మెప్పిస్తాడా

will sharwanand prove as mafia donఫ్యామిలీ చిత్రాలతో , లవ్ ఎంటర్ టైనర్ లతో శర్వానంద్ వరుస విజయాలు సాధిస్తున్నాడు , గత ఏడాది మహానుభావుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు అయితే తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచే మనసు చిత్రంలో నటిస్తున్నాడు . హను లై చిత్రంతో ఘోర పరాజయం అందుకున్నాడు అయినప్పటికీ అతడు చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమా చేస్తున్నాడు .ఆ సినిమా అయిపోవచ్చింది దాంతో ఏప్రిల్ 6న కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఈ కొత్త సినిమాకు దర్శకుడు సుధీర్ వర్మ . స్వామిరారా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ఆ తర్వాత కేశవ వంటి యావరేజ్ సినిమాకు దర్శకత్వం వహించాడు . అయితే ఇప్పుడు శర్వానంద్ ని మాఫియా డాన్ గా చూపించడానికి సుధీర్ ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇప్పటికే ఓసారి రాంగోపాల్ వర్మ శర్వా ని మాఫియా డాన్ గా చూపిస్తానని ఘోరమైన ప్లాప్ ఇచ్చాడు . మరి ఇప్పుడు సుధీర్ వర్మ శర్వానంద్ ని మాఫియా డాన్ గా చూపిస్తూ మెప్పిస్తాడా ? లేదా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All