Homeటాప్ స్టోరీస్జూన్ 15న రికార్డులు బద్దలు కానున్నాయా

జూన్ 15న రికార్డులు బద్దలు కానున్నాయా

will salman khan break the all records with race 3జూన్ 15 న ” రేస్ 3” చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది . రేస్ చిత్రాలు వరుసగా రెండు సిరీస్ లు కూడా సంచలన విజయాలు సాధించాయి దాంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . పైగా ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో కావడం ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో జూన్ 15న పాత రికార్డులు బద్దలై సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం .

సల్మాన్ ఖాన్ తో పాటు సీనియర్ హీరో అనిల్ కపూర్ హాట్ భామలు జాక్వెలెన్ ఫెర్నాండేజ్ , డైసీషా , బాబీ డియోల్ , సాకిబ్ సలీం లు నటించారు . రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర శాటిలైట్ హక్కులు 130 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది , ఒకవేళ అదే నిజమైతే అప్పుడే రికార్డుల వేట మొదలైనట్లే ఎందుకంటే ఇప్పటివరకు అమిర్ ఖాన్ దంగల్ చిత్ర శాటిలైట్ హక్కులకు 120 కోట్లు పలికినట్లు రికార్డ్ ఉంది ….. ఆ రికార్డ్ ని సల్మాన్ ముందే బద్దలు కొట్టాడు ఇక కొట్టాల్సింది బాక్సాఫీస్ రికార్డులను . సల్మాన్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమని అంటున్నారు . రేస్ సిరీస్ లో వస్తున్న మూడో భాగం కాబట్టి భారీగా అంచనాలు నెలకొన్నాయి .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All