Homeటాప్ స్టోరీస్చంద్రబాబు అండతో గెలిచిన వాళ్ళు మళ్లీ గెలుస్తారా?

చంద్రబాబు అండతో గెలిచిన వాళ్ళు మళ్లీ గెలుస్తారా?

Will once again win tdp old mla candidates in telangana 2014 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరుపున మొత్తం 15 మంది గెలువగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఐదుగురు గెలిచారు. దాంతో మొత్తం 20 మంది అయ్యారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎం ఎల్ ఏ లను పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ లో మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎం ఎల్ ఏ సండ్ర వెంకట వీరయ్య ఒక్కడే ఉన్నాడు . రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా , బిసి నాయకుడు కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ తో సఖ్యతగా ఉండటం లేదు. అంటే మిగతా 12 మంది తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా ఉంది దాంతో గత ఎన్నికల్లో మొత్తం 11 మంది ఎం ఎల్ ఏ లుగా గ్రేటర్ పరిధిలోనే ఎన్నికయ్యారు. మిగతా నలుగురిలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి , సండ్ర వెంకట వీరయ్య , ఇతర జిల్లాల నుండి గెలిచారు.

తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన 11 మంది శాసన సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ గౌడ్ , మాగంటి గోపినాధ్, అరికేపూడి గాంధీ, కెపి వివేకానంద , మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి , సాయన్న, కృష్ణయ్య , మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కాకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయగా ఈసారి మాత్రం టీఆర్ఎస్ తరుపున పోటీకి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీని , చంద్రబాబు నాయుడు ని నిలువునా ముంచిన ఈ నాయకులు మళ్లీ గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుందని భ్రమలో ఉన్నారు . అయితే గ్రేటర్ లో తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ల శాతం ఉంది. మరి ఆ ఓటర్లు ముఖ్యంగా సీమాంధ్రులు ఒక్కటిగా నిలబడితే , టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న వాళ్లకు ముచ్చెమటలు పట్టడం ఖాయం.

- Advertisement -

English Title: Will once again win tdp old mla candidates in telangana

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All