Homeటాప్ స్టోరీస్నాని కృష్ణార్జున యుద్ధం తో హిట్ కొడతాడా

నాని కృష్ణార్జున యుద్ధం తో హిట్ కొడతాడా

will nani get success with krishnarjuna yuddhamనాని ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ” కృష్ణార్జున యుద్ధం ”. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ తొలి చిత్రంతో ఆకట్టుకున్నాడు దాని తర్వాత శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం చేసాడు అది కూడా హిట్టే ! దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి దానికి తోడు నాని గత రెండున్నరేళ్లు గా వరుస విజయాలు అందుకుంటున్నాడు .

ఇక ఈ సినిమా విశేషం ఏంటంటే ఇందులో నాని రెండు పాత్రలు పోషించాడు . ఇంతకుముందు నాని ద్విపాత్రాభినయం పోషించిన జెండాపై కపిరాజు ప్లాప్ కాగా , జెంటిల్ మెన్ చిత్రం మాత్రం హిట్ అయ్యింది దాంతో మిక్స్ డ్ రిజల్ట్ అందుకున్నాడు నాని దాంతో ఈ సినిమాపై ఆ మేఘాలు కమ్ముకున్నాయి . పైగా చరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తున్న ఈ సమయంలో నాని సాహసం చేస్తున్నాడా ? అన్న మాట వినిపిస్తోంది . అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ నాని హిట్ కొడతాడా చూడాలి . ఇక కృష్ణార్జున యుద్ధం చిత్రం ఈనెల 12న విడుదల అవుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All