Homeటాప్ స్టోరీస్నాగార్జున ఆ బయ్యర్ ని ఆదుకుంటాడా

నాగార్జున ఆ బయ్యర్ ని ఆదుకుంటాడా

will nagarjuna help to andhra buyerనాగార్జున హీరో కదా అని నమ్మి ఆఫీసర్ చిత్రాన్ని ఆంధ్రా అంతటికి మూడు కోట్లకు పైగా ఇచ్చి కొనుక్కున్నాడు సుబ్రహ్మణ్యం అనే బయ్యర్ అయితే ఆఫీసర్ దారుణంగా దెబ్బతినడంతో ఆ బయ్యర్ లబోదిబో మంటూ నాకు ఇక ఆత్మహత్యే శరణ్యం అంటూ బోరుమంటున్నాడు . ఇక దర్శకులు రాంగోపాల్ వర్మ అండ్ కో సినిమా ఘోరంగా దెబ్బ తినడంతో వెంటనే హైదరాబాద్ నుండి ముంబై కి చెక్కేశాడట . దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్ చిత్రాన్ని కొనుక్కున్న సుబ్రహ్మణ్యం తన గోడుని ఎవరికీ చెప్పుకోవాలో తెలీక కన్నీళ్ళ పర్యంతం అవుతున్నాడు .

రాంగోపాల్ వర్మ పరమ చెత్త సినిమాలు చేస్తున్నాడని తెలిసి కూడా మరోసారి అతడి కి ఛాన్స్ ఇవ్వడం నాగార్జున చేసిన పెద్ద తప్పు , పైగా అఖిల్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు స్వయంగా రాంగోపాల్ వర్మే ప్రకటించుకున్నాడు ఇంకా నాగార్జున ఒప్పుకోలేదు కానీ ఆఫీసర్ రిజల్ట్ చూసాక ఇక వర్మ ని ఇప్పట్లో నాగార్జున దగ్గరకు రానిచ్చే పరిస్థితి అయితే లేదు . ఇక ఆంధ్రా బయ్యర్ కు నాగార్జున న్యాయం చేస్తాడా ? అంటే అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే ! ఎందుకంటే ఈ ఆఫీసర్ చిత్రానికి నాగార్జున కేవలం హీరో మాత్రమే ! నాగార్జున పేరు చెప్పుకొని రాంగోపాల్ వర్మ మాత్రం డబ్బులు పిండుకున్నాడు నాసిరకమైన చిత్రాన్ని చేసి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All