
మహర్షి చిత్రాన్ని 110 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కు అమ్మారు అంటే 110 కోట్లకు పైగా షేర్ రావాలి . లాభాల్లోకి రావాలంటే మినిమమ్ 120 కోట్ల షేర్ రావాలి మరి మహర్షి 120 కోట్ల షేర్ సాధిస్తాడా ? 120 కోట్ల షేర్ అంటే దాదాపుగా 220 కోట్ల వసూళ్లు రావాలి అది మహేష్ వల్ల అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన మహర్షి చిత్రానికి 150 కోట్ల ఖర్చు అయ్యిందట !
150 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే తేడా వస్తే బయ్యర్లు రోడ్డున పడటం ఖాయం . బడ్జెట్ రోజు రోజుకి పెరుగుతోంది కానీ వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు . మహేష్ బాబు స్టార్ హీరో కాబట్టి భారీ ఓపెనింగ్స్ తప్పకుండా వస్తాయి . అయితే సినిమా సూపర్ గా ఉందని టాక్ వస్తేనే రికార్డులు బద్దలు అవుతాయి అప్పుడు 120 కోట్ల షేర్ వస్తుంది . శాటిలైట్ , హిందీ డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ రూపంలో మహర్షి చిత్రానికి బాగానే గిట్టుబాటు అయ్యింది . ఇక రావాల్సింది బయ్యర్లకు . ఇది సినిమా రిలీజ్ అయ్యాకే వస్తుంది . కాకపోతే 120 కోట్ల షేర్ అంటే మాటలు కాదు మరి . ఇది మహేష్ సాధిస్తే మహేష్ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలుస్తుంది .