Homeటాప్ స్టోరీస్మహేష్ బుల్లితెరపై నటించనున్నాడా

మహేష్ బుల్లితెరపై నటించనున్నాడా

will mahesh babu doing a web seriesటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరపై నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది . మహేష్ బాబు ఏంటి ? టివి సిరీస్ లో నటించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? వెబ్ సిరీస్ కి ఎక్కడాలేని క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే . కాలం మారుతోంది దాంతో పాటే మనమూ మారాలి కాబట్టి మహేష్ వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా నటించాలని అనుకుంటున్నాడట అయితే ఈ వ్యవహారం అంతా మహేష్ భార్య నమ్రత ప్లాన్ అన్నమాట ! తెరవెనుక ఉండి మహేష్ వ్యవహారాలు చక్కబెడుతున్న నమ్రత తో నెట్ ఫ్లిక్స్ చర్చలు జరుపుతోందట !

రెమ్యునరేషన్ , కథ నచ్చితే త్వరలోనే వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ ఉంటుంది . వెబ్ సిరీస్ లలో హాలీవుడ్ , బాలీవుడ్ నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు కాగా ఇప్పుడా ట్రెండ్ టాలీవుడ్ లో కూడా మొదలు అవుతోంది . ఇప్పటికే తెలుగులో పలు వెబ్ సిరీస్ లు వచ్చాయి అయితే మహేష్ బాబు వెబ్ సిరీస్ లో నటిస్తే ఆ రేంజ్ వేరు అని ప్రత్యేకంగా చెప్పాలా ? ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉన్నాడు మహేష్ . మహర్షి చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: will mahesh babu doing a web series

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All