Homeటాప్ స్టోరీస్ఈ సీనియర్ హీరో హిట్ కొట్టగలడా ?

ఈ సీనియర్ హీరో హిట్ కొట్టగలడా ?

Will hero Srikanth gets success with political filmతక్కువ సమయంలోనే వంద చిత్రాలను పూర్తిచేసిన హీరో శ్రీకాంత్ , అయితే ఇప్పుడు యువతరం హీరోలు దూసుకువస్తున్న రోజులు కావడంతో ఈ ఫ్యామిలీ చిత్రాల హీరో రేసులో లేకుండా పోయాడు . ఇతర హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నాడు కూడా అయితే అప్పుడప్పుడు మాత్రం హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు . అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలీడం లేదు కూడా . తాజాగా శ్రీకాంత్ హీరోగా రెండు సినిమాల్లో నటించాడు ఒకటి తెలంగాణ దేవుడు , రెండోది ఆపరేషన్ 2019 . రెండు చిత్రాలు కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కావడం గమనార్హం .

అయితే తెలంగాణ దేవుడు కేసీఆర్ నేపథ్యంలో సాగే కథ కాగా ఆపరేషన్ 2019 చిత్రం మాత్రం ఈరోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి , రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు , అలాగే జనాలు ఓట్ల కోసం నోట్లు ఎలా తీసుకుంటున్నారు అన్న అంశాల నేపథ్యంలో తెరకెక్కింది . ఆపరేషన్ 2019 చిత్రం రేపు విడుదల అవుతోంది . ఆపరేషన్ దుర్యోధన చిత్రం శ్రీకాంత్ కు మంచి హిట్ గా నిలిచింది దాంతో ఆపరేషన్ 2019 అనే చిత్రం చేసారు . మరి ఈ హీరో కు సోలోగా హిట్ కొట్టే దమ్ము ఉందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .

- Advertisement -

English Title: Will hero Srikanth gets success with political film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All