Homeటాప్ స్టోరీస్షకలక శంకర్ హీరోగా సక్సెస్ కొడతాడా

షకలక శంకర్ హీరోగా సక్సెస్ కొడతాడా

will comedian shakalaka shankar get success with shambho shankaraజబర్దస్త్ తో షకలక శంకర్ వెలుగులోకి వచ్చాడు . ఆ షో పుణ్యమా అని శంకర్ కు పలు తెలుగు సినిమాల్లో కమెడియన్ వేషాలు వచ్చాయి కట్ చేస్తే మిగతా కమెడియన్ ల లాగే షకలక శంకర్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు శంభో శంకర చిత్రంతో . శ్రీధర్ దర్శకత్వంలో వై . రమణారెడ్డి – సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”శంభో శంకర ” . ఈ చిత్రం ఈనెల 29 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా రాణించాడు షకలక శంకర్ . లవ్ , యాక్షన్ , కామెడీ ఇలా రకరకాల సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నాడు . అయితే కమెడియన్ లు హీరోలుగా మారడం , అందులో కొంతమంది సక్సెస్ లు తాత్కాలికంగా చవిచూసినప్పటికీ హీరోగా టర్న్ అయి నిలబడిన వాళ్ళు మాత్రం పెద్దగా లేరు పైగా కెరీర్ ని పాడుచేసుకున్న వాళ్లే అధికం . మరి షకలక శంకర్ హాస్య నటుడిగా తన వేషాలను చూస్కోకుండా హీరోగా మారి రిస్క్ చేస్తున్నాడా ? హిట్ కొట్టాకా ఇక కమెడియన్ గా నటించను అంటూ కండీషన్ లు గట్రా పెడతాడా ? లేదా హిట్ కొట్టినా కామెడీ వేషాలు వేసుకుంటూ పోతాడా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All