Homeఎక్స్ క్లూసివ్బ్లఫ్ మాస్టర్ హిట్ కొడతాడా ?

బ్లఫ్ మాస్టర్ హిట్ కొడతాడా ?

Will Bluff Master get success
satyadev

తమిళంలో హిట్ అయిన ” శతురంగ వెట్టై ” చిత్రాన్ని తెలుగులో ” బ్లఫ్ మాస్టర్ ” గా రీమేక్ చేసారు .  గోపి గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్  అనే అప్ కమింగ్ హీరో ప్రధాన పాత్రలో  నటించాడు .  ఈ సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది . అలాగే టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెల బోతోంది సరైన సినిమాలు లేక . ఉన్నవి అంతగా ప్రభావం చూపించడం లేదు ఇక భారీ సినిమాలు రావాలంటే రెండు వారాల సమయం ఉంది దాంతో ఆ గ్యాప్ ని పూరించాలంటే …… ఈనెల 28 న విడుదల అవుతున్న బ్లఫ్ మాస్టర్ వల్ల అవుతుందా ? అన్న ప్రశ్న ఉదయించక మానదు . అయితే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో !

సరిగ్గా ఆ కోవలోకే బ్లఫ్ మాస్టర్ చేరొచ్చు అన్న టాక్ వినబడుతోంది . కథ , కథనం రెండు గంటల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటే చిన్న హీరో , చిన్న దర్శకుడు అన్న తేడా ప్రేక్షకుడు చూపించడు . కాకపోతే ఫలానా సినిమా బాగుంది అన్న టాక్ ప్రేక్షకుల చెవిన పడాలి అంతే ! ఈనెల 28 న విడుదల అవుతున్న చిత్రాల్లో కాస్త మొగ్గు ఉన్న చిత్రం బ్లఫ్ మాస్టర్ . ఆ సినిమా టాక్ ఏమాత్రం బాగున్నా ఈ రెండు వారాల పాటు దుమ్ము దులిపేయడం ఖాయం . ఆ గ్యాప్ ఉంది మరి దాన్ని బ్లఫ్ మాస్టర్ పూరిస్తాడా చూడాలి .

- Advertisement -

English Title: Will Bluff Master get success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All