Homeటాప్ స్టోరీస్ఆంధ్రా సెంటిమెంట్ తో గెల్చినవాళ్ళు మళ్ళీ గెలుస్తారా ?

ఆంధ్రా సెంటిమెంట్ తో గెల్చినవాళ్ళు మళ్ళీ గెలుస్తారా ?

Will Andhra peoples support to EX TDP MLAsగత ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా కనిపించినప్పటికీ , గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ కి అత్యధిక స్థానాలు వచ్చాయి . తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం అత్యధిక స్థానాలు గెల్చుకొని తన సత్తా చాటింది . మొత్తంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలను గెల్చుకోగా అందులో 12 స్థానాలు గ్రేటర్ లోనివే కావడం విశేషం అలాగే టీడీపీ కి గ్రేటర్ లో ఉన్న ఓటు బ్యాంక్ ని ఇది సూచిస్తోంది . అయితే రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసు తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది . అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి దాంతో ఆంధ్రా ఓట్లు కీలకం కానున్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో .

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి చాలామంది గెలిచినప్పటికీ శేరిలింగం పల్లి ఎం ఎల్ ఏ అరికపూడి గాంధీ , జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాధ్ , కూకట్ పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు లు ఈసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు . అయితే గత ఎన్నికల్లో వీళ్ళు ఆంధ్రా ఓట్ల తో గెలవగలిగారు అందునా తెలుగుదేశం పార్టీ తరుపున కానీ ఈసారి టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి గెలుస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే సెటిలర్లు వీళ్లకు ఓట్లు వేస్తేనే గెలుస్తారు లేదంటే ఓడిపోవడం ఖాయం . వీళ్ళే కాదు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 28 నియోజకవర్గాలు ఉండగా అందులో 23 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ధేశించేది కేవలం ఆంధ్రా ఓటర్లు మాత్రమే ! వాళ్లంతా గంపగుత్తగా ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంటే వాళ్లే గెలుస్తారు లేదంటే ఓడిపోవడమే ! గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసారు కాబట్టి గెలిచారు మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ? తెలుగుదేశం జెండా పట్టుకొని గెల్చిన అరికపూడి గాంధీ , మాగంటి గోపీనాధ్ , తలసాని శ్రీనివాస యాదవ్ , మాధవరం కృష్ణారావు , వివేకానంద , తీగల కృష్ణారెడ్డి , మంచిరెడ్డి కిషన్ రెడ్డి , సాయన్న , ఎర్రబెల్లి దయాకర్ రావు , చల్ల ధర్మారెడ్డి , ప్రకాష్ గౌడ్ ,రాజేందర్ రెడ్డి తదితరులంతా గులాబీ జెండా పట్టుకున్నారు . మరి ఇప్పుడు గులాబీ జెండా తో గెలుస్తారా ? ప్రజలు ఓట్లు వేస్తారా ? చూడాలి .

- Advertisement -

English Title: Will Andhra peoples support to EX TDP MLAs

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All