Homeటాప్ స్టోరీస్అల్లరి నరేష్ ఇప్పుడన్నా కొడతాడా ?

అల్లరి నరేష్ ఇప్పుడన్నా కొడతాడా ?

అల్లరి నరేష్ కు గత ఏడేళ్లుగా కాలం కలిసి రావడం లేదు చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయాలు అవుతూనే ఉన్నాయి . దాంతో అసలు రేసులో లేకుండాపోయాడు. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు ఏకైక అప్షన్ అల్లరి నరేష్ కానీ ప్రేక్షకులు ఆశించే చిత్రాలను అందించకపోవడంతో అల్లరి నరేష్ ని తిప్పికొట్టారు . దాంతో ముక్కీ మూలుగుతూ ఏదో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు .

- Advertisement -

అయితే ఇప్పుడు మహేష్ బాబు మహర్షి చిత్ర రూపంలో అదృష్టం కలిసి వచ్చింది . భారీ స్థాయిలో సినిమా రిలీజ్ అవుతోంది . పైగా మహర్షి చిత్రాన్ని కీలక మలుపు తిప్పే పాత్రలో అల్లరి నరేష్ నటించాడు అని వినిపిస్తోంది . అలాగే ఇప్పటికే దర్శకులు వంశీ పైడిపల్లి హీరో మహేష్ బాబు తదితరులు అల్లరి నరేష్ కు మంచి పాత్ర లభించిందని అన్నారు కూడా . దాంతో అల్లరి నరేష్ కు సాలిడ్ హిట్ దక్కాలంటే మహర్షి రూపంలో మంచి ఛాన్స్ లభించింది . ఇది హిట్ అయితే తప్పకుండా అల్లరి నరేష్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All