Homeగాసిప్స్అల్లు అర్జున్ సైరా ఈవెంట్ కు స్కిప్ కొట్టడానికి కారణం అదేనా?

అల్లు అర్జున్ సైరా ఈవెంట్ కు స్కిప్ కొట్టడానికి కారణం అదేనా?

Allu Arjun
అల్లు అర్జున్ సైరా ఈవెంట్ కు స్కిప్ కొట్టడానికి కారణం అదేనా?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం, తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం, ఒకేసారి ఐదు భాషల్లో విడుదలవుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అందుకే ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెగా హీరోలనుండి అందరూ వచ్చారు. ఒక్క బన్నీ తప్ప. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ సందడి చేసారు కానీ బన్నీ రాని లోటు అలాగే ఉండిపోయింది.

ఇంతకీ బన్నీ ఎందుకు రాలేదు అన్నది అభిమానులకు అర్ధం కావడం లేదు. అల్లు అర్జున్ ఊర్లోనే ఉన్నాడు. మరి ఊర్లో ఉన్నా కూడా బన్నీ హాజరుకాకపోవడానికి కారణం ఏంటనేది అభిమానులకు ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. బన్నీ మెగా ఫ్యామిలీ దూరం జరిగాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయ్. నిన్న అల్లు అర్జున్ హాజరుకాకపోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.

- Advertisement -

అంతేకాకుండా నాలుగు రోజుల క్రితం విడుదలైన సైరా ట్రైలర్ గురించి ప్రముఖులంతా స్పందించారు. దాదాపు ఇండస్ట్రీ మొత్తం సైరా ట్రైలర్ ను మెచ్చుకుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఏదో జరిగినట్లే అనిపిస్తోంది కదూ!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All