Homeటాప్ స్టోరీస్ఆ బయోపిక్ చేసేంత దమ్ము ఎవరికీ లేదా ?

ఆ బయోపిక్ చేసేంత దమ్ము ఎవరికీ లేదా ?

Who will make krishna biopic ?సాహసమే నా ఊపిరి అనేది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే ! అవును తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన హీరోలలో కృష్ణ నెంబర్ వన్ అనే చెప్పాలి . సాహసాలు చేయడం అంటే కృష్ణ కు వెన్నతో పెట్టిన విద్య అందుకే తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సాహసాలు చేసి అజరామరమైన విజయాలను అందుకున్నాడు . తిరుగులేని స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ని వ్యతిరేకించి రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి , శక్తి కూడా కృష్ణ . అప్పట్లో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చేయాలనీ ఎన్టీఆర్ అనుకుంటుండగా దాన్ని తీసి విమర్శకుల ప్రశంసలతో పాటుగా అవార్డులను , రివార్డులను గెల్చుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ . ఎన్టీఆర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున సినిమాలు తీసిన వ్యక్తి కూడా కృష్ణ మాత్రమే !

అయితే అలాంటి కృష్ణ బయోపిక్ ని చేయాలంటే మాత్రం చాలామంది భయపడుతున్నారు . అసలు హీరోగా పనికిరాడు అన్న విమర్శలను ఎదుర్కొన్న కృష్ణ తన బలహీనతలను బలంగా మార్చుకొని ఎన్టీఆర్ తర్వాత అంతటి స్టార్ డం పొందిన హీరో అయ్యాడు . ఇప్పుడు టాలీవుడ్ లో కూడా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది దాంతో కృష్ణ బయోపిక్ చేయాలనీ కొంతమంది తహతహలాడుతున్నారు కానీ సాహసం మాత్రం చేయడం లేదు ఇక కృష్ణ అల్లుడు యువ హీరో సుధీర్ అయితే మామగారి బయోపిక్ చేసేంత దమ్ము లేదని తేల్చి చెప్పాడు కూడా . సాహసాలతో సహవాసం చేసిన కృష్ణ బయోపిక్ గా తెరకెక్కిస్తే ఒక సామాన్య వ్యక్తి ఎలా అంచలంచెలుగా ఎదగగలడో ఈతరానికి తెలుస్తుంది మరి ఆ సాహసం చేసే వాళ్ళు ఎవరు ? అంత దమ్ము ఎవరికీ లేదా ?

- Advertisement -

English Title: Who will make krishna biopic ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All