Homeటాప్ స్టోరీస్రాంగోపాల్ వర్మ ని చంపేదెవరు ?

రాంగోపాల్ వర్మ ని చంపేదెవరు ?

Who killed Ram Gopal Varmaశివ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ . దర్శకత్వ శాఖలో పూర్తిగా అనుభవం లేకపోయినప్పటికీ అతడు చెప్పిన కథ నచ్చిఅక్కినేని నాగార్జున అవకాశం ఇచ్చాడు . ఇక దర్శకత్వ శాఖలో అనుభవం ఉన్నవాళ్ళ ని పెట్టుకొని , ఛాయాగ్రహణం లో మంచి పట్టున్న గోపాల్ రెడ్డి ని కెమెరా మెన్ గా పెట్టుకొని శివ సినిమా చేసాడు . అయితే తన మైండ్ లో ఏ సీన్ ఎలా ఉండాలో ఊహించుకొని మాత్రమే డైరెక్షన్ చేసాడు వర్మ , కానీ ఆ పనితీరు అప్పట్లో ఆ చిత్ర యూనిట్ వాళ్లకు నచ్చేది కాదు ఎందుకంటే అతడి ధోరణి అతడిదే !

కట్ చేస్తే ….. శివ విడుదల అయ్యింది అప్పటి వరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు సినిమాకు సరికొత్త జవసత్వాలు అందించింది అంతే ! రాత్రికి రాత్రే రాంగోపాల్ వర్మ అగ్రశ్రేణి దర్శకుడు అయిపోయాడు . ఆ తర్వాత క్షణక్షణం వంటి హిట్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు . ఇక నిర్మాతగా మనీ , అనగనగా ఒక రోజు వంటి చిత్రాలను నిరించాడు కూడా . గులాబీ , సర్కార్ , రంగీలా , గాయం , సత్య , కిల్లింగ్ వీరప్పన్, రక్తచరిత్ర వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ వర్మ దాదాపు 60 సినిమాల వరకు దర్శకత్వం వహించాడు . అందులో పరమ చెత్త సినిమాలే ఎక్కువ ! అసలు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించింది రాంగోపాల్ వర్మే నా ? అని ఆశ్చర్యం కలగక మానదు . కట్ చేస్తే …… క్రియేటివ్ డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ పరమ చెత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు . దాంతో వర్మ చిత్రాలపై అంచనాలు లేకుండా పోయాయి .

- Advertisement -

సినిమాల సంగతి , హిట్ ల సంగతి పక్కన పెడితే ……. చీటికి మాటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేని పోనీ విషయాల్లో తలదూర్చుతూ పలువురు హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు . వర్మ ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తుండటంతో ….. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో అతడి నిజ స్వరూపం ఏంటి అన్నది తెలిసిపోయింది దాంతో వర్మ ని చంపెయ్యాలన్నంత కోపంగా ఉన్నారు మెగా అభిమానులు . కట్ చేస్తే ….. ఇప్పుడు ఆఫీసర్ రూపంలో పరమచెత్త రికార్డ్ ని సొంతం చేసుకోవడంతో తగిన శాస్తి జరిగింది అంటూ మెగా హీరోల అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఒకప్పుడు ఇండియాలోనే బ్రిలియంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు పతనావస్థకు చేరుకున్నాడు . మానవతా విలువలను మంటగలుపుతూ ఎప్పుడో పతనమయ్యాడు రాంగోపాల్ వర్మ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All