Homeటాప్ స్టోరీస్శివాజీరాజా ప్యానల్ దే విజయమా ?

శివాజీరాజా ప్యానల్ దే విజయమా ?

Who is the winner Sivaji Raja and Nareshమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపు ఉదయం ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరుగనున్నాయి . మా ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి . శివాజీరాజా ది ఒక ప్యానల్ కాగా నరేష్ ది మరో ప్యానల్ దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎవరు గెలుస్తారు అన్నది. అయితే ఇప్పటి వరకు ఉన్న బలాబలాలను బట్టి చూస్తే శివాజీరాజా ప్యానల్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

 

- Advertisement -

నరేష్ ప్యానల్ పోటీ మాత్రమే ఇస్తుంది తప్ప గెలిచే సత్తా లేదని అంటున్నారు కాకపోతే కొద్దిగా బెటర్ ఏంటంటే నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు సపోర్ట్ చేస్తుండటం . ఇక మిగతా విషయాల్లో శివాజీరాజా దే పైచేయిగా ఉంది . గత పదేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పలు రకాల బాధ్యతలను తీసుకున్న శివాజీరాజా అన్ని పనుల్లో కూడా విజయం సాధించాడు అలాగే సమర్ధుడు అనిపించుకున్నాడు . దాంతో ఎక్కువమంది శివాజీరాజా పట్ల మొగ్గు చూపుతున్నారు . అలాగే ఇటీవలి కాలం వరకు అధ్యక్షుడి గా ఉన్నాడు , పలు కార్యక్రమాలను చేసాడు దాంతో అతడిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి వీటన్నింటికి తోడు చిరంజీవి అండ ఉంది కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శివాజీరాజా ప్యానల్ గెలవడం ఖాయం .

English Title : Who is the winner Sivaji Raja and Naresh ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All