Homeటాప్ స్టోరీస్ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ తో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . అయితే ఈ ఫలితాలు రావాలంటే మే 23 వరకు ఎదురు చుడాల్సిందె అయితే ఎన్నికల ముందు నుండి అధికారం లోకి వచ్చేది మేమంటే మేము అంటూ అటు అధికార తెలుగుదేశం పార్టీ ఇటు ప్రతిపక్ష వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి . అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత మాత్రం అధికారం లోకి వస్తోంది మేమె అంటూ జగన్ పార్టీ మరింతగా జోష్ ప్రదర్శిస్తుండటంతో జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు .

- Advertisement -

అయితే తాజాగా శివరామశాస్త్రి అనే జ్యోతిష్యుడు మాత్రం మళ్ళీ అధికారం చేపట్టేది చంద్రబాబు నాయుడే అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు . జగన్ పార్టీకి 58 సీట్లు వస్తే గొప్ప , ఇక పవన్ కళ్యాణ్ ఒకచోట ఓడిపోయి మరోచోట గెలిచి మొత్తం మీద 6 సీట్లు గెల్చుకుంటాడని …… తెలుగుదేశం పార్టీ మాత్రం 112 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఇది నిజం కాకపోతే ఇక భవిష్యత్ లో జ్యోతిష్యం చెప్పనని సవాల్ చేస్తున్నాడు . అయితే అసలు ఫలితాలు మే 23న రానున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All