Homeప్రెస్ నోట్స్"వైట్ పేపర్" టీజర్ ను విడుదల చేసిన యమ్. యల్.ఏ రోజా

“వైట్ పేపర్” టీజర్ ను విడుదల చేసిన యమ్. యల్.ఏ రోజా

"వైట్ పేపర్" టీజర్ ను విడుదల చేసిన యమ్. యల్.ఏ రోజా
“వైట్ పేపర్” టీజర్ ను విడుదల చేసిన యమ్. యల్.ఏ రోజా

“వైట్ పేపర్” చిత్రాన్ని  కేవలం 10 గంటల వ్యవధిలో  చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు.త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ లలో కూడా ఎక్కబోతుంది ఈ చిత్రం.

జి ఎస్ కె ప్రొడక్షన్స్ పతాకంపై అదిరే అభి (అభినయ కృష్ణ) వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ నటీ,నటులు గా  శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం “వైట్ పేపర్”.

- Advertisement -

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ ను  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపు కున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన యమ్. యల్.ఏ రోజా చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత సాయి రాజేష్, నిర్మాత శ్రీనివాస్ ,నిర్మాత శ్రీకర్, జర్నలిస్ట్ ప్రభు , జబర్దస్త్ టీం మెంబెర్స్ హైపర్ అది,అదిరే అభి, పంచ్ ప్రసాద్, ,రాఘవ, గెటప్ శ్రీను, గడ్డం నవీన్, సనత్ నగర్ సత్తి సుధాకర్, తాగుబోతు రమేష్ , ముక్కు అవినాష్ , శివారెడ్డి బ్రదర్ సంపత్ , సత్తి పండు , నంద కిషోర్, విజయ్ బాస్కర్,  తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్ తెలిపారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన యమ్. యల్ రోజా  మాట్లాడుతూ .. చాలా సంవత్సరాలు తర్వాత  అభి గారి కోసం ప్రసాద్ ల్యాబ్ కు రావడం జరిగింది. అభి చాలా డిసిప్లేన్ మల్టీ టాలెంటెడ్ తను ఎప్పుడూ ఏదో చేయాలనే తపన పడుతుంటాడు. అందుకే తను పడే తపన నాకు చాలా నచ్చింది. “పాయింట్ బ్లాంక్” మూవీతో వచ్చి ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.మళ్లీ ఈరోజు పది గంటల్లో మూవీ చేయడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మేము తమిళ్ లో “స్వయంవరం” మూవీ ని 24 గంటల్లో పూర్తి చేశాము  ఒక సాంగ్ చేయడానికే 3 నుండి 5 రోజులు పెట్టె పాటను ప్రభుదేవా మాస్టర్ తో మేము మూడు గంటల్లో చేసి సినిమాను 24 గంటల్లో చేయాలని పరుగులు పెట్టి సినిమాను పూర్తి చేశాము అలాంటిది ఈ సినిమాను పది గంటల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమాకు మీరు పడిన కష్టాన్ని, కృషిని మనమందరం మనస్ఫూర్తిగా అభిని అటు దర్శకుడు అభినందించాలి. ఇందులో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు కథ బాగుండి ఆడియన్స్ ను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమానే.

చాలా చిన్న సినిమాలు విడుదలై  పెద్ద సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాయి. ఈ వైట్ పేపర్ సినిమా గొప్ప విజయం సాధించి దర్శకనిర్మాతలకు గొప్ప పేరు తీసుకు వచ్చి వీరికి మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి.10 గంటల్లో సినిమా చెయ్యాలి అంటే కొంతమంది మంది నటీనటులు టెక్నీషియన్ల  భయపడి వెనక్కి వెళ్లిపోయినా కూడా కొంతమంది  వీళ్ళు ధైర్యానికి  మెచ్చుకొని వీరికి సపోర్ట్ గా నిలిచి 10 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు. ఇలాంటి సినిమా సినిమాలు చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రొటీన్ సినిమాలు చేసే దానికి భిన్నంగా దర్శకుడు శివ ఇలాంటి మంచి కథను ఎన్నుకొని సినిమా చేసినందుకు వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్స్ కి మనము ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్న దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తారు. జబర్దస్త్ కుటుంబ సభ్యుడైన అభిని ఒక యాంకర్ చూశాము. దర్శకుడిగా చూశాం ఇప్పుడు హీరోగా చూస్తున్నాం తను ఈ సినిమాకు తనకు గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను .

దర్శక,నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా ను వన్ అండ్ హాఫ్ ఇయర్  చేశాను రెండో సినిమా నాలుగు సంవత్సరాలు చేశాను. మూడవ సినిమాను ఫాస్ట్ గా చేయాలను కున్నా కూడా 9 నెలలు పట్టింది.అలాంటిది ఈ సినిమాను 10 గంటల్లో పూర్తి చేసి రికార్డు కొట్టడం చాలా గ్రేట్.ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని చాలా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నాను.ఇలాంటి చాలెంజింగ్  సినిమాలను తీయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్లు మా పైన ప్రెజర్ పెడతారు.వీరి ప్రయత్నాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి  ఈ సినిమాను పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.

చిత్ర హీరో అదిరే అభి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోజా గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసం వచ్చి మా టీజర్ ను విడుదల చేసేందుకు వారికి మా ధన్యవాదాలు.దర్శకుడు నన్ను కలసి మంచి థ్రిల్లర్ కథ చేద్దాం.ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి విధంగా 10 గంటల్లో సినిమాను పూర్తి చేద్దాం అన్నాడు. మేము ఈ ప్రాజెక్టు ను ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రీ ప్లాన్డ్ గా మేము ముందే రిహార్సల్ చేసుకున్నాము.షూట్ లోకి వెళ్లిన తరువాత  టైం డిలే కాకూడదని 4 కెమెరాలతో షూట్ చేయడం జరిగింది. 10 గంటల్లో సినిమాను పూర్తి చేస్తే ఔట్ ఫుట్ ఎలా వచ్చింది అనే అనుమానం అందరికి వస్తుంది.షూట్ పూర్తి అయిన తరువాత మొత్తం ట్రిమ్ చేస్తే రెండు గంటల ఫ్యూచర్ ఫిలిం లాగా రూపొందించాము.ఈ సినిమాను ఒకె లోకేషన్ లో జరిగే ఫోన్ బూత్,7500  వంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయి.కానీ తెలుగులో, ఇండియాలో కూడా ఇప్పటివరకు 10 గంటల్లో పూర్తి చేసిన సినిమాలు రాలేదు.ఇప్పుడు మేము తీసిన మా చిత్రం నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.మేము చేసిన అరుదైన ప్రయత్నానికి మెచ్చి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు  సత్కరించారు అంతే కాక ఈ సినిమా త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కనుంది. ఇలాంటి ఎక్స్పరిమెంట్ సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలను సపోర్ట్ చేయడానికి సినీ పెద్దలు ముందుకు వస్తే మాలాంటి వారికి ఏంతో ధైర్యం వస్తుంది.ఇప్పుడు మేము చేసిన సినిమాను  నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎం.ఎల్. ఏ రోజా గారికి మరియు నా జబర్దస్త్ టీమ్ అందరికీ నా ధన్యవాదాలు అన్నారు.

చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ .10 గంటల్లో చేస్తే రికార్డ్ సృష్టిస్తుందని ఈ మూవీ చేయడం జరిగింది.సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో  అభి హీరోగా నటించారు ఈ సినిమా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నపుడు మామూలు సినిమా చేయకుండా డిఫరెంట్ గా చేస్తే ఒక రికార్డుగా మిగిలిపోతుంది అనుకుని చాలా మందిని కలవడం జరిగింది..ఆ తరువాత ఈ కథను రెడీ చేసుకొని పది గంటల్లో సినిమా చేయాలని చెప్పిన తర్వాత చాలామంది భయపడ్డారు. నటీనటులను టెక్నీషియన్లు సెలెక్ట్ చేసుకున్న తరువాత షూటింగ్ మూడు రోజుల్లో ఉందనగా చాలా మంది వెనక్కి వెళ్లిపోయారు. అయినా భయపడకుండా మేము చెప్పిన కాన్సెప్ట్ కథ ను నమ్మిన కొందరు మాకు సపోర్ట్ గా నిలిచి ఈ సినిమా చేయడానికి ముందుకు రావడంతో మేము వైట్ పేపర్ సినిమాను పూర్తి చేయగలిగాము. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎం.ఎల్. ఏ రోజా గారికి మరియు జబర్దస్త్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు అని అన్నారు.

రాగల 24 గంటలు నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ ..నేను చేసిన సినిమా 55 రోజుల్లో చేశాను.ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలు వున్నారు.వారి సపోర్ట్ ఇలాంటి దర్శకులను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి  కొత్త ఎక్సపెరమెంట్  మూవీస్ వస్తాయని అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ .. మంచి కథను తీసుకొని 10 గంటల్లో చేయడం గొప్ప విషయం.జబర్దస్త్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అభి గారి దగ్గరకు,రోజా గారి దగ్గరికి వస్తారు చాలా మంచి మనసున్న వ్యక్తి అభి.అలాంటి మంచి వ్యక్తి కి ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాను.

రాఘవ మాట్లాడుతూ .. అభి గారికి వర్క్ డెడికేషన్ ఎక్కువ 10 గంటల్లో సినిమాను పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కడం అంటే మాటలు కాదు.తెలుగు వారందరికీ చాలా గర్వ కారణం. వీరు చేసిన వైట్ పేపర్ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు.

హైపర్ అధి మాట్లాడుతూ .. అభి గారి దగ్గర నేను చాలా రోజులు పని చేశాము.ట్రైలర్ చాలా బాగుంది. వీరి నుండి ఇలాంటి మంచు ప్రయోగాత్మక సినిమాలు రావాలని కోరుతున్నాను అన్నారు.

ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. అభి గారు ఏది చేసినా కొత్తగా చేస్తాడు.మేము లొకేషన్ షిఫ్ట్ చేయడానికే గంట పడుతుంది.అలాంటిది 10 గంటల్లో చేయడం చాలా గ్రేట్ అన్నారు.

సనత్ నగర్ సత్తి సుధాకర్ మాట్లాడుతూ .. 2 గంటలు కూర్చొని చూసే సినిమాను 10 గంటల్లో తీసి వరల్డ్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం అని అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. దర్శకుడు శివ 10 గంటల్లో సినిమా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. వీరంతా ఎంతో కష్టపడి చాలా డిఫరెంట్ గా చేశారు. వీరికి ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే చాలా బాగుంది. వీరు చేసిన ప్రయోగాన్ని అందరూ మెచ్చుకుంటు న్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు

శివారెడ్డి బ్రదర్ సంపత్ మాట్లాడుతూ ..ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ ఎన్నో చిత్రాల్లో నటుడిగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించాడు. జబర్దస్త్ ఈటీవీ షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు.ఇపుడు హీరోగా చేస్తూ వైట్ పేపర్ చిత్రం తో కొత్త ప్రయోగం చేసిన తనకు ఈ సినిమా గొప్ప విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ వాణి మాట్లాడుతూ .. ఇలాంటి వరల్డ్ రికార్డ్ మూవీ లో చేసే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డాక్టర్ విజయ్ బాస్కర్ మాట్లాడుతూ ..ఈ మూవీ ను ఎంతో డిసిప్లేన్ తో చేశారు.వీరు పడిన శ్రమను ప్రేక్షకులు గుర్తించి ఈ చిత్రాన్ని గొప్ప విజయాన్ని అందించాలని అన్నారు.

లోబో మాట్లాడుతూ ..అభి లో హార్డ్ వర్క్ ఉంది. కథలో మంచి కంటెంట్ ఉంది.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

గడ్డం నవీన్ మాట్లాడుతూ .. అభి గారు చేస్తున్న ఈ వైట్ పేపర్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సత్తి పండు ,పంచ్ ప్రసాద్ ,నంద కిషోర్ ,తదితర జబర్దస్త్ టీం సభ్యులు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
అదిరే అభి అభినయ కృష్ణ వాణి తల్లాడ సాయి కృష్ణ స్నేహ నందకిషోర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : జి ఎస్ పి ప్రొడక్షన్స్
నిర్మాత : గ్రంధి శివకుమార్
డైరెక్టర్ : శివ
కెమెరా : మురళీకృష్ణ
ఎడిటింగ్ : కె.సి. బి.హరి
సంగీతం : నవనీత్ చారి
పి ఆర్ వో : బాబు నాయక్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All