Homeఎక్స్ క్లూసివ్నాని ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

నాని ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

Nani and Hanu raghavapudi
Nani and Hanu raghavapudi

పడిపడి లేచె మనసు చిత్రంతో మరోసారి ప్లాప్ అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి . ఈ సినిమాకంటే ముందు లై అనే డిజాస్టర్ చవిచూశాడు . ఇక ఆ సినిమా తర్వాత హను తో సినిమా చేయడానికి భయపడతారు అనుకుంటే శర్వానంద్ ఛాన్స్ ఇచ్చాడు , కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యింది కానీ ఫలితం నిరాశ . అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ నాని తో ఓ సినిమా చేయాల్సి ఉంది హను రాఘవపూడి .

ఇంతకుముందు నాని – హను రాఘవపూడి కాంబినేషన్ లో ” కృష్ణగాడి వీర ప్రేమ గాధ ” అనే చిత్రం వచ్చింది . మంచి హిట్ అయ్యింది దాంతో మళ్ళీ సినిమా చేద్దామనుకున్నారు . ఇంతలోనే లై సినిమా చేయడం అది డిజాస్టర్ కావడం , ఇప్పుడేమో పడిపడి లేచె మనసు చేయడం ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరడంతో నాని హను కు ఛాన్స్ ఇస్తాడా ? అన్నది ప్రశ్నగా మారింది .ఇప్పటికే నాని దేవదాస్ చిత్రంతో ఖంగుతిన్నాడు . ఇటువంటి పరిస్థితిలో హను కు ఛాన్స్ ఇస్తాడా ? లేక హ్యాండ్ ఇస్తాడా ? చూడాలి .

- Advertisement -

English Title: What about Nani and Hanu raghavapudi film ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All